ETV Bharat / state

Inter Student Excel in Karate: కరాటేలో గోదారమ్మాయి సత్తా.. పంచ్ కొడితే పతకం ఖాయం - కరాటే మార్షల్ ఆర్ట్స్​లో రాణిస్తున్న యువతి న్యూస్

Inter Student Excel in Karate: చిన్నప్పుడు సరదాగా మొదలైన అలవాటు క్రమంగా కెరీర్‌గా మారింది. పట్టు పట్టి కరాటే నేర్చుకుని పోటీల్లో తన సత్తా ఏమిటో చూపిస్తోంది. పాల్గొన్న ప్రతి పోటీలో కచ్చితంగా పతకం సాధిస్తోంది. పంచ్‌ కొడితే పతకం తన ఖాతాలో పడాల్సిందే అంటోంది ఆ యువతి. మరి, పేద కుటుంబం నుంచి వచ్చి కరాటేలో సత్తా చాటుతున్న ఆ యువతి ఎవరు..? ఆమె ప్రయాణం ఎలా సాగుతోంది..

Inter_Student_Excel_in_Karate
Inter_Student_Excel_in_Karate
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 7, 2023, 5:50 PM IST

Inter Student Excel in Karate: గోదారమ్మాయి పంచ్ కొడితే.. పతకం ఖాయం

Inter Student Excel in Karate: ఆ గోదారమ్మాయి పంచ్ కొడితే ప్రత్యర్థి సంగతి అంతే. నాన్‌ చాక్‌ తిప్పడమైనా.. కర్రసామైనా.. కరాటే, కుంగ్‌ఫూ అయినా.. ఆ యువతి రంగంలోకి దిగనంత వరకే. తాను దిగిందా.. కచ్చితంగా పతకం తన ఖాతాలో చేరాల్సిందే. అలా సాగుతోందామె ప్రయాణం. కరాటేలోనే కాకుండా అటు చదువులోనూ రాణిస్తూ దూసుకెళ్తోందీ ఫైటర్‌. పంచ్‌ పవర్‌ చూపిస్తున్న ఈ యువతి పేరు శ్రీలక్ష్మీలత. రాజమహేంద్రవరం మల్లయ్యపేట సమీపంలోని వాంబే గృహాల్లో ఉండే నెల్లి అప్పారావు, సుజాత గాయత్రిల కుమార్తె.

Rajamahendravaram Young Girl Excelling in Karate: యువతి తండ్రి ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో ఓ కోళ్ల పెంపకం సంస్థలో చిరుద్యోగి. తల్లి గృహిణి. చిన్నప్పటి నుంచి శ్రీలక్ష్మీలత చదువుల్లో చురుగ్గా ఉండేది. చదువుతో పాటు కరాటే నేర్పించాలనుకున్నాడు తండ్రి. ఆ క్రమంలోనే తనకు కలిగిన ఆసక్తి గురించి చెబుతోంది. ఇంటర్‌ చదువుతున్న శ్రీలక్ష్మీలత అటు కరాటేలోనే కాక చదువుల్లోనూ రాణిస్తోంది. పదిలో మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించింది. తాను రింగ్‌లోకి దిగిన ప్రతీసారి పతకం పట్టుకెళ్తోంది. అందుకు తన కుటుంబ ప్రోత్సాహమే కారణమంటోంది ఈ కరాటే ఫైటర్‌.

తండ్రి కళ్లలో ఆనందం కోసం.. సరికొత్త యంత్రాన్ని ఆవిష్కరించాడో కుమారుడు

"ఆత్మరక్షణ కోసం నేర్చుకున్న కరాటే ఇప్పుడు నాకు మంచి గుర్తింపు తెచ్చిపెడుతోంది. అక్టోబర్‌లో తిరువనంతపురంలో జరిగే కరాటే అసోసియేషన్‌ పోటీల కోసం సిద్ధమవుతున్నాను. ఇందులో గెలిస్తే ఆసియా గేమ్స్​లో పాల్గొనేందుకు నాకు అర్హత లభిస్తుంది. ఆసియా గేమ్స్‌, ఒలింపిక్స్​లో పాల్గొనటం నా లక్ష్యం. కరాటేతో పాటు చదువుల్లోనూ రాణించి ఐఏఎస్ అవ్వాలనుకుంటున్నాను." - శ్రీలక్ష్మీలత, కరాటే క్రీడాకారిణి

Vizianagaram Weight Lifters: ఆర్థిక పరిస్థితులు అంతంత మాత్రమే.. అయినా భళా అనిపిస్తున్న వెయిట్ లిఫ్టర్స్

Inter Student Excel in Karate Martial Arts: ఆత్మరక్షణ కోసం నేర్చుకున్న కరాటే ఇప్పుడు తనకు మంచి గుర్తింపు తెచ్చిపెడుతోందని చెబుతోంది శ్రీలక్ష్మి లత. అక్టోబర్‌లో తిరువనంతపురంలో జరిగే కరాటే అసోసియేషన్‌ పోటీల్లో పాల్గొనేందుకు సన్నద్ధమవతోంది. ఇందులో గెలిస్తే ఆసియా గేమ్స్‌కు అర్హత లభిస్తుంది. ఒలింపిక్స్‌ తన లక్ష్యమంటున్న యువతి ఇటు చదువుల్లోనూ రాణించి ఐఏఎస్ సాధిస్తానంటోంది. ఇన్ని పతకాలు సాధించిన తనను ప్రభుత్వం ఆదుకుని, ప్రోత్సహిస్తే మరింత ఉన్నత స్థాయికి ఎదుగుతుంది అంటున్నారు శ్రీ లక్ష్మి లత కోచ్‌ అరుణ్‌ కుమార్.

Godavari Young Girl Excelling in Karate: తన దగ్గర శిక్షణ తీసుకుంటున్న వారిలో శ్రీలక్ష్మీలతకు ప్రత్యేక శక్తి సామర్థ్యాలున్నాయని చెబుతున్నారు. తమ కుమార్తెను అబ్బాయిలానే పెంచాలనుకున్నానని అంటున్నాడు తండ్రి. అలాగే తన పనులు చేసుకుంటూనే, కాలేజీకి వెళ్తూ, ఇలా కరాటేలో రాణించడం గర్వంగా ఉందని అంటున్నారు శ్రీలక్ష్మీ లత తల్లిదండ్రులు. ప్రభుత్వం ఇటువంటి మట్టిలో మాణిక్యాల్ని గుర్తించి, తగిన ప్రోత్సాహం కల్పించాలని గ్రామస్థులు, కుటుంబ సభ్యులు కోరుతున్నారు. భవిష్యత్‌లో శ్రీలక్ష్మీలత మరింత ఉన్నత స్థానాలు అధిరోహించాలని ఆశిద్దాం.

Srikanth Talent: ఈ తరం కోసం.. నాట్యం చేస్తూ కొండలు ఎక్కుతున్న శ్రీకాంత్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.