ETV Bharat / state

"యుద్ధం వస్తే ప్రపంచపటంలో పాక్ కనిపించదు"

పాకిస్థాన్​పై కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్​రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తూర్పు గోదావరి జిల్లాలో ఓ కార్యక్రమానికి హాజరైన ఆయన పొరుగు దేశంపై మండిపడ్డారు. వేర్పాటువాదం, ఉగ్రవాదాన్ని దేశంలో లేకుండా చేస్తామని స్పష్టం చేశారు.

కిషన్ రెడ్డి
author img

By

Published : Sep 22, 2019, 4:38 PM IST

జేఎన్​టీయూకేలో కిషన్​రెడ్డి ప్రసంగం

ఈసారి యుద్దం వస్తే ప్రపంచ పటంలో పాకిస్థాన్ కన్పించదని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. సమయం వచ్చినపుడు పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌(పీవోకే) సంగతి తేలుస్తామని ఆయన వ్యాఖ్యానించారు. జేఎన్​టీయూ కాకినాడ ఆడిటోరియంలో 370 ఆర్టికల్‌ రద్దుపై అవగాహన సదస్సు నిర్వహించారు. దీనికి కిషన్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. జనసంఘ్‌ పార్టీ పుట్టిందే ఆర్టికల్‌ 370కి వ్యతిరేకంగా అని... పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు దీని కోసం బలిదానం అయ్యారని అన్నారు. ఆర్టికల్‌ 370 కారణంగా పాకిస్థాన్‌తో 4 యుద్దాలు జరిగాయని ఇప్పటివరకూ 42వేల మంది ప్రజలు ఉగ్రవాదానికి బలయ్యారని కిషన్‌రెడ్డి చెప్పారు. ఆర్టికల్ 370ని రద్దును ప్రశ్నించే కాంగ్రెస్, కమ్యూనిస్ట్ నాయకులు కశ్మీర్‌లో ఉగ్రవాదం కారణంగా ఎన్నో దారుణాలు జరుగుతుంటే ఎందుకు మాట్లాడరని ఆయన ప్రశ్నించారు. పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ తాటాకు చప్పుళ్లకు కేంద్ర ప్రభుత్వం భయపడదని కిషన్‌ రెడ్డి పేర్కొన్నారు. వేర్పాటువాదాన్ని, ఉగ్రవాదాన్ని దేశంలో లేకుండా చేస్తామని స్పష్టం చేశారు. సభ ప్రారంభానికి ముందు ఎంపీ వంగాగీత, ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి కిషన్‌రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సమావేశంలో భాజపా నాయకులు సోము వీర్రాజు, మాలకొండయ్య, కార్యకర్తలు పాల్గొన్నారు

Intro:ap_gnt_82_22_tdp_incharge_aravindhababu_pressmeet_avb_ap10170

నరసరావుపేట తెదేపా కార్యాలయంలో ఆదివారం మీడియా సమావేశం నిర్వహించారు. సమావేశంలో టీడీపీ ఇంచార్జి అరవింద బాబు మాట్లాడారు. గత రెండురోజుల క్రితం రొంపిచర్ల మండలం రామిరెడ్డిపాలెం లో జరిగిన వ్యక్తిగత గొడవలో తెదేపా కార్యకర్త పై కేసు పెట్టడం సమంజసం కాదన్నారు.

Body:గ్రామంలో ఇద్దరు వ్యక్తులు వ్యక్తిగత గొడవలకు పాల్పడితే తెదేపా మాజీసర్పంచి కోటిరెడ్డిపై పోలీసులు అన్యాయంగా కేసు బనాయిస్తున్నారని అరవింద బాబు ఆరోపించారు. గత ప్రభుత్వ పాలనలో కోటిరెడ్డికి ఉత్తమ సర్పంచిగా పురస్కారం లభించిందని తెలిపారు. అటువంటి వ్యక్తిని వైసీపీ అధికారంలోకి రాగానే గొడవలు సృస్థించి గ్రామం వదలి వెళ్లేలా చేశారన్నారు. కోటిరెడ్డి ప్రస్తుతం గుంటూరు లో నివసిస్తుంటే రాజనాల వెంకటరెడ్డిపై దాడి చేశాడని కేసు బనాయించడం దారుణమని అరవింద బాబు ఆవేదన వ్యక్తం చేశారు.

Conclusion:నియోజకవర్గ ప్రజలు పార్టీలకు అతీతంగా కలసికట్టుగా శాంతియుతంగా ఉండాలని కోరారు.అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే గోపిరెడ్డి కూడా తమ పార్టీ కార్యకర్తలకు చెప్పి గ్రామాల్లో శాంతిని నెలకొల్పాలని చదలవాడ సూచించారు. పోలీసులు సైతం గ్రామాల్లో అన్యాయంగా తెదేపా కార్యకర్తలపై కేసులు పెట్టడం మానుకోవాలని అరవింద బాబు పార్టీ పరంగా హెచ్చరించారు.

బైట్: చదలవాడ. అరవింద బాబు, నరసరావుపేట తెదేపా ఇంచార్జి.

ఆర్.చంద్రశేఖరరావు,
ఈటీవీ రిపోర్టర్,
నరసరావుపేట,
9885066052.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.