ETV Bharat / state

అభివృద్ధిలో మేటి... ఉత్తమ పంచాయతీలుగా ఎంపిక - తూర్పు గోదావరిలో ఆదర్శంగా నిలుస్తున్న గ్రామాలు తాజా న్యూస్

ఎన్నికలు ఏవైనా.. గెలుపొందిన అభ్యర్థులు గ్రామ అభివృద్ధి కోసం తమవంతు కృషి చేశారు. ఫలితంగా ఉన్నంతలో ఊరికి వైభవం తెస్తూ.. మిగతా పల్లెలకు ఆదర్శంగా నిలిచారు. అభివృద్ధికి బాటలు వేస్తూ.. స్థానిక గ్రామాలకు మార్గనిర్దేశంగా నిలుస్తున్నారు. తూర్పు గోదావరి జిల్లాలోని పలు గ్రామాలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి పలు పురస్కారాలను అందుకున్నాయి. వాటి ద్వారా వచ్చిన నగదుతో మరింత అభివృద్ధికి పాటుపడుతున్నారు.

Ideal panchayats in East Godavari district
అభివృద్ధిలో మేటి... ఉత్తమ పంచాయతీలుగా ఎంపిక...
author img

By

Published : Feb 4, 2021, 4:56 PM IST

ఊరు బాగుంటే ప్రజలంతా హాయిగా ఊపిరి పీల్చుకుంటారు. సదుపాయాలు సమకూరితే పాలనకూ తమవంతు సహకారం అందిస్తారు. ఈ గ్రామాల్లో జరిగింది అదే. మైనర్‌... మేజర్‌... పంచాయతీ ఏదైనా అభివృద్ధికి బాటలు వేశారు. ఉన్నంతలో ఊరికి వైభవం తెచ్చారు. మిగతా పల్లెలకు ఆదర్శంగా నిలిచారు. ఇందులో కొన్ని కేంద్ర, రాష్ట్ర పురస్కారాలను సైతం అందుకున్నాయి. వాటి ద్వారా వచ్చిన నగదుతో తమ ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేసుకున్నాయి.

పలు సేవలకు.. పురస్కారాలు..

వసతుల కల్పన, అందించిన పలు సేవలకు గాను రావులపాలెం పంచాయతీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పురస్కారాలు అందుకుంది. పారిశుద్ధ్య నిర్వహణ, మౌలిక వసతుల కల్పన, ఇంటి పన్ను వసూలు, రికార్డులు ఆన్‌లైన్‌ అంశాల్లో రాష్ట్రంలోనే మేటిగా నిలిచి 2015-16, 2016-17 సంవత్సరాల్లో వరుసగా రెండేళ్లు ఉత్తమ పంచాయతీ పురస్కారాలను అందుకుంది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి రూ.3.లక్షలు నగదు పురస్కారం పొందింది. మిషన్‌ అంతోద్యయలో భాగంగా కేంద్ర ప్రభుత్వం 2017 సంవత్సరంలో ఈ పంచాయతీకి ఉత్తమ పురస్కారం అందించింది.

వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణంలో ముందువరస..

జగ్గంపేట మండలంలోని మల్లిసాల గ్రామం వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణంలో ఆదర్శంగా నిలవడంతో కేంద్ర ప్రభుత్వం నిర్మల్‌ గ్రామ పురస్కారానికి గతంలో ఎంపికైంది. గ్రామంలో 2011 జనాభా లెక్కల ప్రకారం 5,195 జనాభా నివాసం ఉంటున్నారు. ఈ గ్రామంలో దాదాపు అన్ని ఇళ్లలో వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించారు. 95 శాతం ఇళ్లలో వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మాణం చేపట్టడంతో పురస్కారం లభించింది. పంచాయతీకి రూ.4 లక్షలు ప్రత్యేక గ్రాంటు విడుదల చేశారు.

శతశాతం పన్ను.. వసూల్లో హ్యాట్రిక్‌..

తునిలోని చేపూరు గ్రామవాసులు 2016-17, 2017-18, 2018-19 ఆర్థిక సంవత్సరాల్లో పంచాయతీకి ఇంటి, మంచి నీటి పన్నును వందశాతం చెల్లించారు. దీంతో అధికారులు గ్రామంలో పూర్తిస్థాయిలో మౌలిక వసతులు కల్పించ గలుగుతున్నారు. గత ఎన్నికల్లో సర్పంచి పదవిని ఏకగ్రీవం చేయడంతో ప్రభుత్వం సుమారు రూ.7 లక్షలు మంజూరు చేసింది.

బాలల అభ్యున్నతికి స్ఫూర్తిబాట..

నేటి బాలలే... రేపటి పౌరులు స్ఫూర్తికి ఆ గ్రామ ప్రజలంతా ఒక్కమాటపై నిలిచారు. ఇటుక బట్టీలు ఎక్కువగా ఉండే ఈ ప్రాంతంలో ఏ పిల్లవాడు పనికి వెళ్లకుండా బడికి వెళ్లేలా చూశారు. కేంద్ర ప్రభుత్వం అందించే ఛైల్డ్‌ ఫ్రెండ్లీ పురస్కారం 2020లో సొంతం చేసుకున్నారు. ఆలమూరు మండలం మూలస్థానం అగ్రహారం పంచాయతీ స్ఫూర్తి బాట ఇది. ఈ గ్రామంలో 7,231 మంది జనాభా, 5,428 ఓటర్లు ఉన్నారు. జడ్పీ ఉన్నత పాఠశాల ఒకటి, ఎంపీపీ పాఠశాలలు మూడు ఉండగా వీటిలో మొత్తం 705 మంది విద్య అభ్యసిస్తున్నారు. అంగన్‌వాడీ కేంద్రాలు ఈ గ్రామంలో ఎనిమిది ఉన్నాయి. వీటిలో 434 మంది చిన్నారులు పూర్వ ప్రాథమిక విద్యను అభ్యసిస్తున్నారు. కేంద్ర బృందం సర్వే చేసి పురస్కారం కింద రూ.5 లక్షలు అందించింది.

చిన్న పంచాయతీ... అభివృద్ధిలో మేటి..

పి.గన్నవరం మండలం యర్రంశెట్టివారిపాలెం మైనర్‌ పంచాయతీ. 1970కి ముందు ఇక్కడకు మూడున్నర కిలోమీటర్ల దూరంలోగా ఊడివమూడి మేజర్‌ పంచాయతీలో ఇదో వార్డుగా ఉండేది. తర్వాత ఎనిమిది వార్డులతో పంచాయతీగా రూపుదిద్దుకుంది. వచ్చే ఆదాయం స్వల్పమైనా పలువురు సర్పంచుల కృషిఫలితంగా గ్రామానికి మౌలిక వనతులు సమకూరాయి. రైతులు లంక భూముల్లోకి వెళ్లేందుకు వీలుగా అప్పటి సర్పంచి మేడిది రామారావు కాలిబాట వంతెన నిర్మించారు. వంతెన నిర్మాణ వ్యయం రూ.30 వేలులో రూ.7,500 రామారావు వితరణగా అందించారు. ఆయన కృషి ఫలితంగా మరో వంతెన నిర్మితమైంది. ఇలా వంతెనల నిర్మాణాలకుగాను అప్పట్లో సర్పంచి ఎకరం భూమి అమ్మేసి తనవంతు వితరణ అందించారని నేటికీ చెప్పుకొంటారు.

పచ్చని గిరిపై ప్రత్యేకతల కోట..

కొండపై నాలుగు తండాల పంచాయతీ బురదకోట. బురదకోట, బాపన్నధార, కొండపల్లి, కె.మిర్తివాడ తండాలతో ఉండే ప్రత్తిపాడు పంచాయతీకి సంబంధించి కొన్ని అంశాలు అందరూ మెచ్చేలా ఉంటాయి. 740 మంది ఓటర్లున్న ఈ పల్లెలో ఎన్నిక ఏదైనా కాలినడకన కొండదిగి ఓటేయడం ప్రాణంతో సమానంగా భావిస్తారు. అందుకే నూరుశాతం ఓటింగ్‌ ప్రత్యేకత. పంచాయతీ పన్ను డిమాండ్‌ రూ.35 వేలు. ఏటా వందశాతం వసూలవుతుంది. పక్కా డ్రైన్లు, తీరైన రహదారులు లేకపోవచ్చు. మురుగు వదిలేసే తీరే ఉండదు. స్వచ్ఛంగా మెరిసిపోతాయి. గతంలో ఇక్కడి కొండలను ఆసరా చేసుకొని మైదాన ప్రాంతాల వాళ్లు కొందరు గంజాయి సాగుచేసేవారు. ఆ అపప్రదను వదిలించుకుంది ఈ పంచాయతీ. ఓటేయడంలో, పన్ను చెల్లించడంలో, ఊరిని శుభ్రంగా ఉంచడంలో, ప్రకృతిని నమ్ముకొని బతకడంలో ఇలా బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించడంలో బురదకోట ఇతర పల్లెలకు ఆదర్శంగా నిలుస్తోంది.

ఇదీ చదవండి:

పంచాయతీ ఎన్నికల్లో వినూత్న ప్రచారాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.