తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం ఐటీడీఏ పీవో నిశాంత్ కుమార్ అనంతపురం జిల్లాకు బదిలీ అయ్యారు. రంపచోడవరం ఐటీడీఏ కార్యాలయంలో ఆయనకు సన్మానం చేశారు. నిశాంత్ కుమార్ను సబ్ కలెక్టర్ ప్రవీణ్ ఆదిత్య, ఏఎస్పీ వకుల్ జిందాల్, ఐటీడీఏ డిప్యూటీ డైరెక్టర్ సరస్వతి, ఐటీడీఏ ఏపీవో నాయుడు తదితరులు ఘనంగా సన్మానించారు. ఏజెన్సీలో రహదారుల నిర్మాణంతో పాటు సెల్ టవర్లను ఏర్పాటు చేసి సమాచార వ్యవస్థను బలోపేతం చేశారని అధికారులు కొనియాడారు.
ఇదీచూడండి.