తూర్పుగోదావరి జిల్లాలో భానుడు భగ్గుమంటున్నాడు. యాస్ తుపాను తీరం దాటినప్పటి నుంచి జిల్లాలో పగటి ఉష్ణోగ్రతలు పెరగడంతోపాటు వడగాల్పుల ప్రభావం తీవ్రంగా ఉంటోంది. కె. గంగవరం(పామర్రు)లో గరిష్టంగా 45.5 ఉష్ణోగ్రత నమోదైంది. ఈ ఏడాది ఇదే అత్యధికం. జిల్లావ్యాప్తంగా ఉదయం 11 గంటల నుంచే వేడిగాలుల తీవ్రత మొదలై.. ఆ ప్రభావం సాయంత్రం 7 గంటల వరకు కొనసాగుతోంది. 16 మండలాల్లో 40 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
జూన్ మొదటి వారంలో రుతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ కలెక్టరేట్‌కు సూచించింది. రానున్న వారంలో రోజులు జిల్లాలో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని తెలిపింది.
ఇదీ చదవండి: అబ్బురపరుస్తున్న "లవ్"లీ మ్యాంగో!