తూర్పుగోదావరి జిల్లా తుని పట్టణంలో మూడు పాజిటివ్ కేసులు నమోదు కావటంతో అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. కోవిడ్-19 కేసులు నమోదైన పెద్ద వీధి, పండా వీధి కంటైన్మెంట్ జోన్ లుగా కొనసాగుతున్నాయి. ఇక్కడ అన్ని కార్యకలాపాలు నిషేధించారు. ఎక్కడికక్కడ బారికేడ్లు ఏర్పాటు చేశారు. పురపాలక కమిషనర్ ప్రసాద రాజు ఆయా ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టారు. క్రిమి సంహారక మందు పిచికారీ చేస్తూ వైరస్ వ్యాప్తి చెందకుండా పకడ్బందీగా అమలు చేస్తున్నారు. పాజిటివ్ వచ్చిన వారి కుటుంబ సభ్యులు, బంధువులు 45 మందికి పరీక్షలు చేయగా వీరికి నెగిటివ్ వచ్చిందని అధికారులు తెలిపారు. అంతే కాకుండా మరో 330 మంది శాంపిల్స్ సేకరించగా వీటి ఫలితాలు రావాల్సి ఉంది.
తుని.. ఎక్కడికక్కడ అప్రమత్తం - తుని పట్టణంలో 3 పాజిటివ్ కేసులు
తూర్పుగోదావరి జిల్లా తుని పట్టణంలో 3 పాజిటివ్ కేసులు నమోదు కావటంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. కోవిడ్-19 కేసులు నమోదైన వీధులు కంటైన్మెంట్ జోన్ లుగా కొనసాగుతున్నాయి.