తూర్పుగోదావరి జిల్లా తాళ్లరేవు మండలం కోరంగిలో కోడి కత్తి తయారీ స్థావరంపై పోలీసులు దాడి చేశారు. ఓ వ్యక్తి నుంచి సుమారు రూ.12 లక్షలు విలువ చేసే 3 వేల 980 కత్తులు, వాటి తయారీకి ఉపయోగించే రెండు యంత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు కాకినాడ డీఎస్పీ కుమార్ వివరించారు. కోడి కత్తి తయారీ కేంద్ర నిర్వాహకుడు సోమరాజును అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. ఎవరైనా కోడి పందేల నిర్వహణ వంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని డీఎస్పీ హెచ్చరించారు.
ఇదీ చూడండి: