గత వారం రోజులుగా ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం వద్ద గోదావరి వరద ఉద్ధృతి పెరిగింది. వారం రోజులుగా వర్షాలు విస్తారంగా కురవడం గోదావరిలోకి పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరింది. గతేడాది ఆగస్టు నెలలో వరద ఉద్ధృతి నెలకొంది.
ఈ ఏడాది కాపర్ డ్యాం నిర్మాణం పూర్తవడం, ఎగువున వర్షపు నీరు గోదావరిలోకి వచ్చి చేరింది. దీంతో గోదావరి ఎరుపు రంగులోకి మారి మహోగ్రంగా ప్రవహిస్తోంది. దీంతో దేవీపట్నం మండలంలో ముంపుకు గురయ్యే గ్రామాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.
ఇవీ చూడండి...