మహారాష్ట్రలోని విదర్భ పరిసర ప్రాంతాలపై ఆవరించిన అల్పపీడన ప్రాంతం కొనసాగుతోంది. దీంతో పాటు ఏపీ, తెలంగాణాల మీదుగా గుజరాత్ వరకూ రుతుపవన ద్రోణి కూడా కొనసాగుతోంది. ప్రస్తుతమిది గుజరాత్లోని భుజ్ నుంచి విదర్భ- రామగుండం- మచిలీపట్నం మీదుగా పశ్చిమ మధ్య బంగాళాఖాతం వరకూ విస్తరించి ఉన్నట్లు అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీని ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి.
ప్రత్యేకించి ఉత్తర కోస్తాంధ్రలోని విజయనగరం, విశాఖలతో పాటు దక్షిణ కోస్తాలోని పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో కొన్ని చోట్ల మోస్తరు నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తున్నట్టుగా అమరావతి వాతావరణ కేంద్రం తెలియచేసింది. రాగల 24 గంటల్లో దక్షిణ కోస్తా, రాయల సీమ జిల్లాల్లో పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. అటు ఉత్తర కోస్తా జిల్లాల్లోనూ అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
ఇదీ చూడండి: WEATHER INFORMATION: బంగాళాఖాతంలో అల్పపీడనం..ఆ జిల్లాల్లో భారీ వర్షాలు..!