తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఈదురుగాలులు బలంగా వీచడం వల్ల పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ వృక్షం నేలకొరిగింది. స్టేషన్ కేబిన్పై చెట్టు పడటం వల్ల ఒక్కసారిగా పోలీసు సిబ్బంది అంతా ఉలిక్కిపడ్డారు. ఆ సమయంలో ఎవరూ అక్కడ లేకపోవడం వల్ల పెను ప్రమాదం తప్పింది. వర్షం కారణంగా పలు ప్రాంతాల్లో చెట్లు, విధ్యుత్ స్తంభాలు నేలకొరిగి.. సరఫరా నిలిచిపోయింది.
ఇవీ చూడండి...