ఉదయం 11 గంటల నుంచి తూర్పుగోదావరి జిల్లాలో కుండపోతగా వర్షం కురుస్తోంది. నాలుగు రోజుల కిందటి భారీ వానలకు లోతట్టు ప్రాంతాలు ఇప్పటికీ నీటిలోనే కొట్టుమిట్టాడుతున్నాయి. మరోసారి వరుణుడి ప్రతాపానికి కోనసీమ వణికిపోతోంది.
అమలాపురం, మలికిపురం, అంబాజీపేట, పి గన్నవరం మండలాల్లో కారుమబ్బులు కమ్ముకుని జోరుగా వర్షం పడుతోంది. పంటల పరిస్థితి ఏమిటోనని రైతులు తలలుపట్టుకుని కూర్చున్నారు.
ఇదీ చదవండి: భారీ వర్షానికి నీటమునిగిన జీసీసీ గోదాములు- తడిచిన నిత్యావసరాలు