ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు తూర్పుగోదావరి జిల్లా అతలాకుతలం అవుతోంది. జిల్లాలోని చాలా నియోజకవర్గాల్లో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలు ప్రాంతాల్లో వరి చేలు నీటమునిగాయి. రామచంద్రాపురం నియోజకవర్గంలోని మండపేట, కపిలేశ్వరపురం, కాజులూరు మండలాల్లోని వేల హెక్టార్లలో పంట నీటిపాలైంది. ఎకరానికి రూ.30 వేల వరకు పెట్టుబడి పెట్టామనీ... వర్షాలతో అంతా నష్టపోయామని రైతులు ఆవేదన వ్యక్తంచేశారు. 10రోజుల్లో పంట చేతికొచ్చే సమయంలో ఇలా నీటిపాలైందనీ... ప్రభుత్వం తమను ఆదుకోవాలని అన్నదాతలు కోరుతున్నారు.
అటు కోనసీమలో లోతట్టు ప్రాంతాలు చెరువులను తలపిస్తున్నాయి. వరిచేలు నీటమునిగి నానుతున్నాయి. రహదారులపై గుంతల్లో నీరు నిలిచి అధ్వానంగా తయారయ్యాయి. అమలాపురం, పీ. గన్నవరం, రాజోలు, ముమ్మడివరం, అయినవిల్లి, మామిడికుదురు, అంబాజీపేట, సఖినేటిపల్లి, మలికిపురం మండలాల్లో కుండపోత వర్షం కారణంగా భారీ నష్టం వాటిల్లిందని రైతులు చెప్పారు.
ఇవీ చదవండి..