ETV Bharat / state

తీవ్రవాయుగుండం.. ఉభయగోదావరి జిల్లాలకు గండం!

కాకినాడ వద్ద తీరం దాటిన వాయుగుండం.... ఉభయగోదావరి జిల్లాలపైనా తీవ్ర ప్రభావం చూపుతోంది. రెండుజిల్లాల్లోనూ భారీవర్షాలతో అనేకచోట్ల ఇళ్లు, పొలాలు నీటమునిగాయి. విద్యుత్తు సరఫరా సహా రాకపోకలకు అంతరాయం కలిగింది.

తీవ్రవాయుగుండం.. ఉభయగోదావరి జిల్లాలకు గండం!
తీవ్రవాయుగుండం.. ఉభయగోదావరి జిల్లాలకు గండం!
author img

By

Published : Oct 14, 2020, 3:05 AM IST

Updated : Oct 14, 2020, 12:31 PM IST

తీవ్రవాయుగుండం.. ఉభయగోదావరి జిల్లాలకు గండం!

ఉభయగోదావరి జిల్లాలపై.... తీవ్రవాయుగుండం పెనుప్రభావం చూపుతోంది. పశ్చిమగోదావరి జిల్లాలో ఏజెన్సీ మెట్ట ప్రాంతాల్లో వాగులూ వంకలూ పొంగిపొర్లుతున్నాయి. జలాశయాలకు నీరు భారీగా చేరుతోంది. తమ్మిలేరు, ఎర్రకాలువ జలాశయాలకు ప్రవాహం ఉద్ధృతంగా ఉంది. తమ్మిలేరు నుంచి నీటిని దిగువకు విడుదలతో ఏలూరులో అనేక లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. వైఎస్​ఆర్ కాలనీ, చాటపర్రు ప్రజలకు పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. వరి, పత్తి, మిరప, కూరగాయలు, అరటి రైతులు తీవ్రంగా నష్టపోయారు. సుమారు 20 వేల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. నరసాపురం, మొగల్తూరు ప్రాంతాల్లో ఆక్వా చెరువుల్లో నీటి చేరికతో రైతులు భారీగా నష్టపోయారు.

పశ్చిమగోదావరి జిల్లాలో 48 గ్రామాలకు, విద్యుత్ అంతరాయం ఏర్పడింది. 62 కిలోమీటర్ల మేర రహదారులు దెబ్బతిన్నాయి. ఉండి పరిధిలో వర్షానికి రోడ్లు, ఇళ్లు నీటమునిగాయి. ద్విచక్రవాహనాలు, కార్ల సైలెన్సర్లలోకి.. నీరు చేరింది. వేలేరుపాడు మండలం కుమ్మరిగూడానికి రాకపోకలు నిలిచాయి. అనారోగ్యంతో బాధపడుతున్న ఓ బాలింతను.., 108 సిబ్బంది ఉద్ధృతంగా ప్రవహిస్తున్న వాగు దాటించి వాహనంలోకి ఎక్కించారు.

తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం మన్యం ప్రాంతంలో జలాశయాలకు జలకళ వచ్చింది. కొండవాగులు పొంగిపొర్లుతున్నాయి. సీతపల్లి వాగు వద్ద దుస్తులు ఉతుకుతున్న మహిళ ఉద్ధృతి కారణంగా కొట్టుకుపోతుండగా స్థానికులు కాపాడారు. ప్రత్తిపాడు పరిధిలో పేదలకు ప్రభుత్వం కేటాయించిన ఇళ్ల స్థలాలు ముంపునకు గురయ్యాయి.

కాకినాడ, రాజమహేంద్రవరం, రామచంద్రాపురం, అమలాపురం, పెద్దాపురం, రంపచోడవరం పరిధిలో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. చెట్లు, విద్యుత్‌ స్తంభాలు నేలకొరిగాయి. పంటలు నీటమునిగాయి. కాకినాడ, రాజమహేంద్రవరంలో అనేక కాలనీలు, ప్రభుత్వ కార్యాలయాలు జలమయమయ్యాయి. బొమ్మూరులో గోడకూలి మహిళ మృతిచెందారు. ఏలేరు నుంచి దిగువకు నీటి విడుదలతో.. ప్రత్తిపాడు, జగ్గంపేట, పెద్దాపురం, పిఠాపురం పరిధిలో పొలాలు నీటమునిగాయి. ఏలేరు కాలువకు 26 చోట్ల గండ్లు పడి పొలాలను ముంచేసింది. జిల్లాలో 21వేలకు పైగా హెక్టార్లలో వరి, 18 వందల హెక్టార్లలో ఉద్యానవన పంటలు, 350 హెక్టార్లలో పత్తిపంట మునిగింది.

కాకినాడలో సబ్‌స్టేషన్‌ నీట మునిగింది. కొన్ని ప్రాంతాల్లో ఇళ్లు, పంటలు. పూర్తిగా నీటి ముంపులోనే నానుతున్నాయి.

ఇదీ చదవండి:

అల్పపీడనంగా కొనసాగుతున్న తీవ్రవాయుగుండం

Last Updated : Oct 14, 2020, 12:31 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.