తూర్పుగోదావరి జిల్లాలో అంతర్భాగమైన కేంద్రపాలిత యానాంలో ఉదయం 7 గంటల నుంచి దాదాపు గంటన్నర పాటు వర్షం ఎకధాటిగా కురిసింది. భారీ వర్షం కారణంగా ప్రధాన రహదారితోపాటు లోతట్టు ప్రాంతాలన్నీ మోకాలులోతు నీటితో జలమయమయ్యాయి. ఉరుములు, మెరుపులతో కూడిన ఈ వర్షానికి.. జన జీవనం పూర్తిగా స్తంభించింది.
ఉదయాన్నే పాలు, కూరగాయలు, అల్పాహారం కొరకు ప్రధాన వీధుల్లోకి వచ్చే వారంతా వర్షానికి తడిసి ముద్దయ్యారు. యానాంలోని సుప్రసిద్ధ పిల్లరాయ ఆలయంలోనికి వర్షం నీరు చేరడంతో పూజా సామాగ్రి నీటిలో తేలియాడుతూ కనిపించాయి. ఆలయంలోని ప్రధాన విగ్రహం వరకు వర్షం నీరు చేరింది. ప్రభుత్వ డిగ్రీ కళాశాల, జూనియర్ కళాశాల ప్రాంగణాలు చెరువులను తలపిస్తున్నాయి.
ఇదీ చూడండి:
POLLING: హుజూరాబాద్ ఉప ఎన్నికలో 9 గంటలకు పోలింగ్ శాతం ఇలా...