తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం నగరంలో కురిసిన వర్షానికి ప్రజలు అవస్థలు పడ్డారు. మురుగు కాల్వలు పూడుకుపోవడంతో... రహదారులు చెరువులను తలపించాయి. రైల్వేస్టేషన్ రోడ్డులోని రైలు వంతెన కింద భారీగా నీరు చేరి... ఆర్టీసీ బస్సు నిలిచిపోయింది. విద్యార్థులంతా నీటిలో దిగి బస్సును వెనక్కి నెట్టారు. డీలక్స్ కూడలిలో మురుగునీరు నిలిచిపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. కంబాలచెరువు సమీపంలోని హైటెక్ బస్టాండ్ వద్ద వాననీరు నిలిచిపోవడంతో వాహనదారులు, బాటసారులు ఇబ్బందులు పడ్డారు.
ఇదీ చదవండీ... సీఎం జగన్తో మేజర్ జనరల్ భేటీ