గోదావరి నదికి వరద నీరు పెరుగుతోంది. తూర్పు గోదావరి జిల్లా కోనసీమలోని లంక రైతుల్లో.. ఈ వరద ఆందోళన పెంచుతోంది. ఎగువ ప్రాంతాల్లో ఎక్కువగా వర్షాలు కురవడం వల్ల వరద నీరు గోదావరిలోకి భారీగా చేరుతోంది. ధవళేశ్వరం బ్యారేజీ నుంచి సముద్రంలోకి వరద నీటిని విడిచిపెడుతున్న పరిస్థితుల్లో... కోనసీమ ముఖద్వారమైన రావులపాలెం మండలంలోని గౌతమి, వశిష్ఠ రెండు వంతెనల వద్ద గోదావరి ఉరకలు వేస్తోంది.
ఇవీ చదవండి...సుప్రీంలో 'పోలవరం'.. 4 వారాలకు విచారణ వాయిదా