ETV Bharat / state

floods: గోదావరికి వరద ఉద్ధృతి .. విపత్తు నిర్వహణశాఖ హెచ్చరికలు - పోలవరం

ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరికి భారీగా వరద చేరుతోంది. ముంపు మండలాలను విపత్తు నిర్వహణ శాఖ అప్రమత్తం చేసింది. అత్యవసర సహాయ చర్యలకు 2 ఎన్డీఆర్ఎఫ్, 3 ఎస్డీఆర్‌ఎఫ్‌ బృందాలను ఏర్పాటు చేశారు. ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద నీటిమట్టం  10.4 అడుగుల మేర ఉండగా.. మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉంది. పోలవరం స్పిల్ వే వద్ద 32.8 మీటర్ల వద్ద వరద ప్రవాహం ఉంది. గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి కన్నబాబు కోరారు.

heavy flood flow in godavari
పరవళ్లు తొక్కుతోన్న గోదావరి
author img

By

Published : Jul 25, 2021, 7:43 AM IST

Updated : Jul 25, 2021, 4:47 PM IST

పరవళ్లు తొక్కుతోన్న గోదారి

రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలు, ఎగువ ప్రాంతాల్లో పోటెత్తుతున్న వరదకు...గోదావరి పరవళ్లు తొక్కుతోంది. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం వద్ద వరద ప్రవాహం ఎక్కువైంది. గోదావరికి వరద పోటెత్తతడంతో...ముంపు మండలాలను విపత్తు నిర్వహణ శాఖ అప్రమత్తం చేసింది. అత్యవసర సహాయ చర్యలకు చింతూరులో 2 బృందాలు, వీ.ఆర్.పురానికి ఒక సహాయ బృందాన్ని పంపించారు. సహాయక చర్యల్లో అధికారులు సహకరించాలని విపత్తు నిర్వహణశాఖ కోరింది. గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి కన్నబాబు కోరారు. బోట్లు, మోటార్ బోట్లు, స్టీమర్లతో నదిలో ప్రయాణించవద్దని .. నదిలో చేపల వేటకు వెళ్లొద్దని విపత్తు నిర్వహణశాఖ హెచ్చరికలు జారీ చేసింది.

ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద నీటిమట్టం 10.4 అడుగుల మేర ఉంది. 8.6 లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. గోదావరి ముంపుప్రాంతాలలో ఇప్పటికే కొన్ని గ్రామాలు జలదిగ్భందంలో ఉన్నాయి. బాధితులు కొండలపై తలదాచుకుంటున్నారు.

పోలవరానికి భారీగా వరద

పశ్చిమగోదావరి జిల్లా పోలవరం ప్రాజెక్టుకు భారీ స్థాయిలో గోదావరి వరద చేరుతోంది. స్పిల్ వే వద్ద 32.8మీటర్ల వద్ద వరద ప్రవాహం ఉంది. కాఫర్ డ్యామ్‌ వద్ద 34.3 మీటర్లకు నీటి ప్రవాహం చేరింది. పోలవరం బోట్ పాయింట్ వద్ద 23.6 మీటర్ల వద్ద నీరుంది. స్పిల్ వే 48 గేట్ల ద్వారా 8.6 లక్షల క్యూసెక్కుల నీటిని అధికారులు కిందకు వదులుతున్నారు. జంగారెడ్డిగూడెం, కేఆర్‌పురంలో సహాయ బృందాలను సిద్ధం చేశారు.

పోలవరం ముంపు గ్రామాలను గోదావరి నీరు ముంచెత్తుతోంది. కొద్దిపాటి వరదకే ప్రాజెక్టు ఎగువన ఉన్న అనేక గ్రామాలు మునిగిపోతున్నాయి. గోదావరికి అడ్డుగా నిర్మించిన ఎగువ కాఫర్‌డ్యాం ప్రభావం స్పష్టంగా కనిపిస్తోందని చెబుతున్నారు. తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలంలో 15 గ్రామాలు, పోలవరం మండలంలో 12 గ్రామాలను నీరు ముంచెత్తింది. అనేక ఊళ్లు ఇప్పటికే ఖాళీ అయ్యాయి. పోలవరం ఏజెన్సీలో ముంపు బాధిత గ్రామాలవారు ఎత్తయిన ప్రాంతాల్లో కొండలపై సొంతంగా ఏర్పాటుచేసుకున్న గుడిసెల్లో ఆశ్రయం పొందుతున్నారు.

భద్రాచలం వద్ద తగ్గుతోన్న నీటిమట్టం

భద్రాచలం వద్ద తగ్గుతున్న గోదావరి నీటిమట్టం తగ్గుతోంది. సుమారు 6 అడుగులకు పైగా నీటిమట్టం తగ్గింది. 43 అడుగుల వద్ద నీటిమట్టం ఉండటంతో.. మొదటి ప్రమాద హెచ్చరికను అధికారులు ఉపసంహరణ .శనివారం సాయంత్రం నీటిమట్టం 48.30 అడుగులు దాటడంతో అధికారులు రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేయగా...ఇప్పుడు వరద ఉద్ధృతి తగ్గింది.

ఇదీ చూడండి. ఊళ్లను ముంచేసిన గోదారి

Last Updated : Jul 25, 2021, 4:47 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.