ETV Bharat / state

యానాంలో కొవిడ్ ఉద్ధృతి.. లాక్​డౌన్ దిశగా చర్యలు! - యానాంలో కరోనా కేసులు

కేంద్రపాలిత ప్రాంతం యానాంలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. కొవిడ్ వ్యాప్తిని అరికట్టడానికి 45 సంవత్సరాలు పైబడిన వారు తప్పకుండా టీకా తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది.

అగ్ని మాపక వాహనం ద్వారా హైపోక్లోరైడ్ ద్రావణం పిచీకారి చేస్తున్న దృశ్యం

author img

By

Published : Apr 22, 2021, 9:34 PM IST

కేంద్ర పాలిత ప్రాంతం యానాంలో కరోనా సెకండ్ వేవ్ తుఫానులా దూసుకొస్తోంది. కేవలం నెల రోజుల్లో 300 మంది మహమ్మారి బారిన పడ్డారు. యానాం ఆరోగ్య శాఖ వ్యాధి వ్యాప్తిని అరికట్టేందుకు 45 సంవత్సరాలు పై బడిన వారంత తప్పని సరిగా టీకాలు వేయించుకోవాలని ఆదేశించింది. ప్రతి గ్రామంలోనూ టీకా కేంద్రాలు అందుబాటులో ఉంచింది. పుదుచ్చేరి లెప్టినెంట్ గవర్నర్ తమిళ సై సౌందర రాజన్ ఉన్నతధికారులతో కరోనా పరిస్థితులను సమీక్షించి వారంతపు లాక్​డౌన్ అమలు చేయాలని నిర్ణయించారు. శుక్రవారం రాత్రి 10 గంటల నుంచి సోమవారం ఉదయం 5 గంటల వరకు అత్యవసర వాహనాలు మినహా రాకపోకలు నిలిపివేయాలని తెలిపారు. మిగిలిన రోజుల్లో రాత్రి కర్ఫ్యూ అమలు చేయాలని సూచించారు. యానాంలో ఇప్పటి వరకు 40 వేల మందికి పరీక్షలు నిర్వహించగా 2569 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. చికిత్స అనంతరం 2204 మంది కోలుకోని ఇంటికి వెళ్లగా 46 మంది మృతి చెందారు. ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 316 గా ఉంది. ఆస్పత్రిలో 101 మంది ఉంటే.. 215 మంది ఇంట్లో ఉండి చికిత్స పొందుతున్నారని డిప్యూటీ కలెక్టర్ అమన్ శర్మ తెలిపారు.

ఇదీ చదవండి: ఈ ఏడాది 50 శాతం తగ్గిన సత్యదేవుని ఆదాయం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.