కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రతి ఇంటికి వెళ్లి పకడ్బందీగా సర్వే నిర్వహించాలని... కుటుంబ ఆరోగ్య సంక్షేమ శాఖ కమిషనర్ భాస్కర్ సిబ్బందిని ఆదేశించారు. కరోనా నివారణ కోసం ఆయన అమరావతి నుంచి అన్ని జిల్లాల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సర్వే నిర్వహించిన అనంతరం.. జలుబు, జ్వరం, దగ్గు తదితర అనారోగ్య సమస్యలతో బాధపడే వారి వివరాలను ఉన్నతాధికారులకు చేరవేయాలని తెలిపారు. తూర్పు గోదావరి జిల్లాలోని వైద్య సిబ్బంది... తహసీల్దార్ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన వీడియో కాన్ఫరెన్స్ కేంద్రానికి వద్దకు వెళ్లి కమిషనర్ చెప్పిన విషయాలను నమోదు చేసుకున్నారు.
ఇదీ చదవండి: