తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం మండలం కాండ్రకోట నూకాలమ్మ జాతర మహోత్సవాలు శనివారం రాత్రి వైభవంగా ప్రారంభమయ్యాయి. నెల రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలకు భారీ సంఖ్యలో భక్తులు హాజరవుతారు. ఉత్సవాల్లో భాగంగా.. గరగల ఊరేగింపు కార్యక్రమం నిర్వహించారు. పూజారులు గరగలు పట్టుకుని గ్రామంలో తిరగగా.. భక్తులు గరగలపై అరటిపండ్లు విసిరారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో ఆలయ పరిసరాలు కిక్కిరిసిపోయాయి.
ఇదీచదవండి.