ETV Bharat / state

ఇసుక కష్టాలు తీరనున్నాయ్.. త్వరలో అమల్లోకి కొత్త పాలసీ - new sand policy

రాష్ట్రంలో కొత్త ఇసుక విధానం అమలు తేదీని ప్రభుత్వం ఖరారు చేసింది. సెప్టెంబరు 5వ తేదీ నుంచి నూతన ఇసుక విధానం అమల్లోకి రానుందని రాష్ట్ర గనులు, భూగర్భవనరుల శాఖ వెల్లడించింది. ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థ ద్వారా ఇసుకను విక్రయించాలని నిర్ణయించిన రాష్ట్ర ప్రభుత్వం.. అప్పటి వరకూ రాష్ట్రంలో ఇసుక సరఫరాకు ఇబ్బందులు రాకుండా చూసేందుకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టింది.

సెప్టెంబరు 5 నుంచి నూతన ఇసుక పాలసీ
author img

By

Published : Jul 18, 2019, 5:29 AM IST

సెప్టెంబరు 5 నుంచి నూతన ఇసుక పాలసీ : రాష్ట్ర గనులు, భూగర్భవనరుల శాఖ

రాష్ట్రంలో సెప్టెంబరు 5వ తేదీన నూతన ఇసుక విధానం అమల్లోకి రానుంది. ఈ మేరకు రాష్ట్ర గనులు, భూగర్భవనరుల శాఖ ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రకటించింది. ప్రభుత్వమే ఇసుక సరఫరా చేసేందుకు అవసరమైన కార్యాచరణ సిద్ధం చేస్తోందని గనుల శాఖ తెలిపింది. ఇకపై ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థ ద్వారా ఇసుకను విక్రయించాలని నిర్ణయించినట్టు వెల్లడించింది. వివిధ ప్రాంతాల్లోని రీచ్​లు గుర్తించాల్సిందిగా ఏపీఎండీసీకి ప్రభుత్వం సూచించింది.

ప్రత్యామ్నాయ ఏర్పాట్లు

కొత్త విధానం అమలయ్యేంత వరకూ రాష్ట్రంలో ఇసుక సరఫరాకు ఇబ్బందులు రాకుండా ప్రత్యామ్నాయ మార్గాలు ఏర్పాట్లు చేయాల్సిందిగా జిల్లా కలెక్టర్లు, ఎస్పీలను ప్రభుత్వం ఆదేశించింది. ఇసుక లభ్యమయ్యే రీచ్​లు, పట్టా భూములు, డిసిల్టేషన్ ప్రాంతాలు, స్టాక్ యార్డులను యుద్ధ ప్రాతిపదికన గుర్తించాలని చెప్పింది. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ నదులు, వాగులు, కాలువలకు అనుబంధంగా ఉండే రీచ్​లు, డిసిల్టేషన్ ప్రాంతాలు, స్టాక్ యార్డుల ఏర్పాటుకు ఉన్న అవకాశాలకు సంబంధించి గనుల శాఖ మంత్రి పెద్ది రెడ్డి జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ చేశారు. రీచ్​లకు అనుసంధానంగా ఉండే రహదారి మార్గాల వివరాలు, సరఫరా వాహనాలకు జీపీఎస్ ఏర్పాటు చేసే అంశంపై వివరాలను ఇవ్వాల్సిందిగా ఆదేశించారు. ఇసుక రేటును నిర్థారించేందుకు లభ్యతను దృష్టిలో ఉంచుకుని స్థానికంగా పలుకుతున్న ధరల వివరాలను కూడా తెలియచేయాలన్నారు.

మరో 45 రిచ్​లు గుర్తింపు

ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 73 ఇసుక రీచ్​లలో 38 లక్షల 38 వేల 415 క్యూబిక్ మీటర్ల ఇసుక లభ్యత ఉందని ప్రభుత్వం గుర్తించింది. అలాగే రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో మరో 45 చోట్ల ఇసుక తవ్వకాలకు వీలుగా రీచ్​లను గుర్తించారు. ఈ ప్రాంతాల్లో 19 లక్షల 11 వేల 884 క్యూబిక్ మీటర్ల ఇసుక లభ్యం కావొచ్చని అంచనా వేస్తున్నారు.

మండల స్థాయిలో పర్యవేక్షణ

83 పట్టా భూముల్లోనూ 34 లక్షల 24 వేల 401 క్యూబిక్ మీటర్ల ఇసుక అందుబాటులో ఉన్నట్లు గనుల శాఖ ప్రభుత్వానికి నివేదించింది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ఇసుక తవ్వకాలపై నిషేదం విధించటం వలన అత్యవసర నిర్మాణాలకు జిల్లా కలెక్టర్ కార్యాలయం నుంచి అనుమతి ఇస్తేనే తవ్వకాలకు అనుమతి ఇచ్చింది. ఇబ్బందులు ఎదురవుతుండడం వలన ఈ నిబంధనలను సడలించి మండలస్థాయిలో అధికారులకు బాధ్యత అప్పగించాలని ముఖ్యమంత్రి జగన్ ఆదేశాలు జారీ చేశారు.

ఇదీ చదవండి : కొత్త ఇసుక పాలసీపై మంత్రుల ఉన్నతస్థాయి సమీక్ష

Intro:kit 736

కోసురు కృష్ణ మూర్తి, అవనిగడ్డ నియోజక వర్గం

సెల్.9299999511

పశు పోషకుల కష్టాలు ఫైల్ నెం.1

Body:పశు పోషకుల కష్టాలు ఫైల్ నెం.1

Conclusion:పశు పోషకుల కష్టాలు ఫైల్ నెం.1
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.