ETV Bharat / state

roads in ap: రోడ్ల దుస్థితిపై తెదేపా ఆందోళన.. రహదారిపై గోరంట్ల బైఠాయింపు - ఏపీలో రోడ్లు దుస్థితి

రాజమహేంద్రవరంలో ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆధ్వర్యంలో తెదేపా శ్రేణులు నిరసన చేపట్టారు. కాతేరు వద్ద ధ్వంసమైన రహదారిపై బైఠాయించి.. వెంటనే మరమ్మతులు చేయించాలని డిమాండ్ చేశారు.

gorantla
గోరంట్ల బుచ్చయ్యచౌదరి
author img

By

Published : Nov 10, 2021, 2:16 PM IST

రాష్ట్రంలో రోడ్లు అధ్వానంగా తయారయ్యాయని, వెంటనే మరమ్మతులు చేయించాలని తెదేపా ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి డిమాండ్ చేశారు. ఆయన ఆధ్వర్యంలో రాజమహేంద్రవరంలో తెదేపా శ్రేణులు నిరసన చేపట్టాయి.

రోడ్ల సెస్సుల ద్వారా వసూలు చేసిన మొత్తాన్ని.. ప్రభుత్వం ఇతర అవసరాలకు మళ్లిస్తోందని గోరంట్ల ఆరోపించారు. రోడ్ల మరమ్మతులు చేపట్టకపోవడం వల్ల ప్రమాదాలు జరిగి.. వైద్యులు, వాహనాల విడిభాగాలకు డిమాండ్ పెరుగుతోందన్నారు.

రాజమహేంద్రవరంలో ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి నిరసన

రాజమహేంద్రవరం కాతేరు దగ్గర ధ్వంసమైన రహదారిపై.. పార్టీ శ్రేణులతో వినూత్న నిరసన చేపట్టారు. అక్కడే చాప వేసుకుని కూర్చున్న బుచ్చయ్య.. ప్రభుత్వం వెంటనే రహదారుల మరమ్మతులు చేపట్టాలని డిమాండ్ చేశారు. పనులు చేసిన గుత్తేదారులకు ప్రభుత్వం బిల్లులు చెల్లించట్లేదని ఆరోపించారు. ప్రభుత్వం తక్షణం స్పందించి రోడ్ల మరమ్మతులు చేపట్టాలని డిమాండ్​ చేశారు.

ఇదీ చదవండి:

ఫోన్​ తీసుకున్న భర్త.. భయపడి భార్య ఆత్మహత్య.. ఇంతలోనే మరో ట్విస్ట్..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.