గోదావరి జలాలను నిల్వ చేసుకునే సామర్థ్యం లేక వర్షాకాలంలో నీరు సముద్రంలో కలిసిపోతుంది. జులైలో తూర్పు గోదావరి జిల్లా ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి 146 టీఎంసీల గోదావరి జలాలు దిగువకు విడిచిపెట్టడంతో వృథాగా సముద్రంలో కలిసిపోయాయి. గత నెలలో గోదావరి నదికి మొత్తం 168 టీఎంసీల నీరు వచ్చింది. దీంట్లో తూర్పు,పశ్చిమ గోదావరి డెల్టా ప్రాంతంలోని ఖరీఫ్ వరి సాగు కోసం 22 టీఎంసీలు వినియోగించుకున్నారు. ధవళేశ్వరం బ్యారేజ్ నీటిని నిల్వ చేసే సామర్థ్యం లేకపోవడంతో ఎక్కువగా లేరు సముద్రంలోకి వదిలేయాల్సిన పరిస్థితులు అనివార్యం అవుతున్నాయి.ఇలా ఈ జులైలో 146 టీఎంసీల గోదావరి జలాలు సముద్రంలో కలిసిపోయాయి. గోదావరి జలాలను సద్వినియోగం చేసుకునే విధంగా ప్రాజెక్టు నిర్మిస్తే ఎంతో మేలు జరుగుతుందిని రైతులు అభిప్రాయపడుతున్నారు.
ఇదీచదవండి
ఆ పోస్టుల భర్తీలో పురోగతి తెలపండి.. ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం