ETV Bharat / state

గోదారి ఉగ్రరూపం..ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక

రాజమహేంద్రవరం వద్ద గోదావరి వరద ఉద్ధృతి కొనసాగుతోంది. ఎగువ నుంచి వస్తోన్న వరదతో ధవళేశ్వరం వద్ద నీటిమట్టం 15.2 అడుగులకు చేరింది. గేట్లు ఎత్తి 14.81 లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేశారు.

author img

By

Published : Sep 9, 2019, 8:01 PM IST

గోదావరికి కొనసాగుతోన్న వరద ఉద్ధృతి
గోదావరికి కొనసాగుతోన్న వరద ఉద్ధృతి

రాజమహేంద్రవరం వద్ద గోదావరి మరింత ఉగ్రరూపం దాలుస్తోంది. ధవళేశ్వరం ఆనకట్ట వద్ద నీటిమట్టం 15.2 అడుగులకు చేరింది. గోదావరిలో వరద ఉద్ధృతితో ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగిస్తున్నారు. ధవళేశ్వరం గేట్లు ఎత్తి 14.81 లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేశారు. భద్రాచలం వద్ద గోదావరి వరద ప్రవాహం తగ్గుతోంది. భద్రాచలం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది.

ముంపులోనే గ్రామాలు
ఉగ్ర గోదావరి పోటెత్తటంతో పోలవరం ఎగువ ప్రాంతంలోని గ్రామాలు నదీ ప్రవాహంతో నిండిపోయాయి. గ్రామాలు నదిలో కలిసిపోయినంతగా వరద గోదావరి ప్రవహిస్తోంది. నీట మునిగిన గ్రామాల్లోని ప్రజలను రక్షించేందుకు సిబ్బంది సహాయకచర్యలు కొనసాగిస్తున్నారు.

ఇదీ చదవండి :

గోదావరి ఉగ్రరూపం... బిక్కుబిక్కుమంటున్న గిరి'జనం'

Intro:Ap_Nlr_03_09_Rottela_Pandugaku_Sarvam_Siddham_Kiran_Pkg_AP10064

కంట్రీబ్యూటర్: టి. కిరణ్, నెల్లూరు సిటీ, 9394450291.

యాంకర్
మత సామరస్యానికి ప్రతీకగా నిలిచే నెల్లూరు బారా షహీద్ దర్గా రొట్టెల పండగకు ముస్తాబైంది. మంగళవారం నుంచి పండగ ప్రారంభం కానుండటంతో అధికార యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేసింది. ఐదు రోజులపాటు జరగనున్న ఈ పండుగకు లక్షల సంఖ్యలో భక్తులు తరలి రానున్నారు.
వి.ఓ.1: నెల్లూరు బారా షహీద్ దర్గా రొట్టెల పండగకు సర్వం సిద్ధమైంది. కులమతాలకు అతీతంగా జరిగే ఈ పండుగకు దేశవిదేశాల నుంచి లక్షల సంఖ్యలో భక్తులు తరలివస్తారు. రెండు శతాబ్దాల క్రితం నెల్లూరు జిల్లా గండవరం వద్ద జరిగిన పవిత్ర యుద్ధంలో మహమ్మద్ ప్రవక్త శిష్యులు వీరమరణం చెందారు. వీరి తలలు తెగి గండవరంలో పడగా, మొండాలు మాత్రం గుర్రంపై వచ్చే స్వర్ణాల చెరువు వద్ద పడ్డాయి. తమిళనాడులోని ఆర్కాట్ నవాబు ఇక్కడ దర్గా కట్టించడంతో అప్పటినుంచి ఈ ప్రాంతం ప్రసిద్ధి చెందింది. బారాషహీద్ సమాధులను దర్శించుకుని స్వర్ణాల చెరువులో రొట్టెలు పట్టుకుంటే కోరికలు తీరుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఈ నెల పదో తేదీన రొట్టెల పండగ ప్రారంభం కానుండగా, 11న గంధ మహోత్సవం, 12న రొట్టెల పండగ, 13న తహలీల్ ఫాతెహా, 14న ముగింపు కార్యక్రమం జరగనుంది.
బైట్: రఫీ, దర్గా ముజావర్, నెల్లూరు.
వి.ఓ.-2: భారీగా తరలి వచ్చే భక్తుల కోసం అన్ని శాఖల సమన్వయంతో అధికారులు, పాలకులు విస్తృత ఏర్పాట్లు చేశారు. బారా షహీద్ ల దర్శనానికి ప్రత్యేక క్యూలైన్లు తో పాటు దర్గా ప్రాంగణమంతా విద్యుద్దీపాలు ఏర్పాటు చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మంచినీటి వసతి, మొబైల్ టాయిలెట్లను సిద్ధం చేశారు. రొట్టెలు మార్చుకునే చెరువును పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టారు. దాదాపు రెండు వేల మందితో పోలీసులు బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిలు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటి పండుగ కావడంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేశామని దర్గా కమిటీ చైర్మన్ రజాక్ తెలిపారు.
బైట్: రజాక్ దర్గా కమిటీ చైర్మన్ నెల్లూరు.
వి.ఓ.-3: ఇంకా పండుగ ప్రారంభం కాకముందే భక్తులు తరలివస్తుండటంతో దర్గా ప్రాంగణం సందడిగా మారింది.

Body:కిరణ్ ఈటీవీ భారత్

Conclusion:9394450291
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.