Godavari River Turns into Pollution: గోదావరి తీరం కాలుష్య కాసారంగా మారుతోంది. ఘాట్ల వద్ద భారీ వ్యర్థాలు పేరుకుపోయి దుర్వాసనతో అధ్వానంగా దర్శనమిస్తున్నాయి. ఘాట్ల నిర్వహణను నగరపాలక సంస్థ పట్టించుకోకపోవడంతో.. స్నానాలు చేసేందుకు భక్తులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. గత పుష్కరాల సమయంలో 12వందల మీటర్లతో దేశంలోనే అతి పొడవైన కోటిలింగాల ఘాట్‌ను నిర్మించారు. ఆ తర్వాత నిర్వహణ గాలికొదిలేయడంతో.. ఘాట్ పొడవునా ప్లాస్టిక్ వ్యర్థాలతో నిండిపోయింది. కనీసం ఈ ఘాట్ నుంచి గోదావరిలోకి దిగేందుకు ఏ మాత్రం అనువుగా లేదు. ఇక్కడే నల్లా ఛానల్ రెండు దశల ద్వారా మురుగునీరు నేరుగా నదిలో కలుస్తోంది. ప్లాస్టిక్ వ్యర్థాలు, మురుగు నీటితో పవిత్ర జలాలు గరళంగా మారుతున్నాయి.
నిత్యం భక్తులు వందల సంఖ్యలో పుణ్య స్నానాలు ఆచరించే పుష్కర్ ఘాట్‌దీ అదే దుస్థితి. మెట్లన్నీ చెత్తతో నిండిపోయాయి. భక్తులు స్నానాలు చేసే చోట కాస్త కార్మికులు శుభ్రం చేస్తున్నా.. మిగతా మెట్లన్నీ ప్లాస్టిక్ వ్యర్థాలతో దర్శనమిస్తున్నాయి. ఈ ఘాట్ వద్ద నగర ప్రజలకు తాగు నీరు అందిచే హెడ్ వాటర్ వర్క్స్ ఉంది. గోదావరి జలాలను శుద్ధి చేసి నగర వాసులకు తాగు నీరు సరఫరా చేస్తారు. మార్కండేయ ఘాట్, పద్మావతీ ఘాట్‌లూ చెత్తతో నిండిపోయాయి. మార్కండేయ ఘాట్ వద్ద రెండు మురుగు కాల్వల ద్వారా నదిలోకి నేరుగా డ్రైనేజీ నీరు చేరుతోంది. ఇక్కడ పిండ ప్రదానాలు చేస్తారు. క్రతువులు ముగిసిన తర్వాత ఈ నీటిలోనే దిగి స్నానాలు చేయడం కష్టంగా మారిందని స్థానికులు చెబుతున్నారు.
Pollution in Godavari River: గోదారి తీరమా.. కాలుష్య కాసారమా.. ఎక్కడ చూసినా వ్యర్థాలే..
గంగానది ప్రక్షాళన తరహాలో గోదావరి శుద్ధి చేయాలన్న ప్రతిపాదనల్ని కేంద్రం ఆమోదించింది. తొలి విడతలో చేపట్టాల్సిన పనులకు రాష్ట్ర ప్రభుత్వ నిధుల విడుదల తీవ్ర జాప్యమైంది. ఎట్టకేలకు గత ఏప్రిల్‌లో విడుదల చేసినా.. నమామి గోదావరి పనులు మాత్రం ప్రారంభమవ్వలేదు. సత్వరమే ప్రారంభించి గోదావరి నదిని కాపాడాలని జనం కోరుతున్నారు.
"పవిత్రమైన గోదావరి నీరు ప్లాస్టిక్ వ్యర్థాలు, చెత్తచెదారంతో కాలుష్యమైపోతోంది. కాలుష్యమైపోయిన ఈ నీటినే మున్సిపాలిటీవాళ్లు తిరిగి తాగునీరుగా రాజమహేంద్రవరంలోని ప్రజలకు సరఫరా చేస్తున్నారు. అధికారులు ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్నారు. కోటిలింగాల ఘాట్ పొడవునా ప్లాస్టిక్ వ్యర్థాలతో నిండిపోయింది. కనీసం ఈ ఘాట్ నుంచి గోదావరిలోకి దిగేందుకు ఏ మాత్రం అనువుగా లేదు. ఇక్కడే నల్లా ఛానల్ రెండు దశల ద్వారా మురుగునీరు నేరుగా నదిలో కలుస్తోంది. ప్లాస్టిక్ వ్యర్థాలు, మురుగు నీటితో పవిత్ర జలాలు గరళంగా మారుతున్నాయి. ఇప్పటికైనా అధికారులు గోదావరి నది పరిరక్షణకు చర్యలు చేపట్టాలని కోరుతున్నాము." - స్థానికులు
Pollution in Godavari River: గోదారమ్మ ఒడిలోకి కాలుష్య వ్యర్థాలు.. పట్టించుకునేవారే కరువాయే..!