ఎగువన కురుస్తున్న వర్షాలతో గోదావరిలో వరద మరింత పెరుగుతోంది. పోలవరం కాఫర్ డ్యామ్ ఎగువన భారీగా వరద ముంపు ఏర్పడింది. భద్రాచలం వద్ద మొదటి ప్రమాద హెచ్చరికను అధికారులు జారీ చేశారు. ధవళేశ్వరం కాటన్ ఆనకట్ట వద్ద 9 అడుగుల నీటిమట్టం ఉంది.
తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం బ్యారేజీ నుంచి ఈరోజు ఉదయం 9 గంటలకు 6 లక్షల 41,000 క్యూసెక్కుల వరద నీటిని సముద్రంలోకి విడిచిపెట్టారు. వరద ఇంకా పెరుగుతుంది మొదటి ప్రమాద హెచ్చరిక స్థాయి వరకు వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. బ్యారేజి నుంచి దిగువన ఉన్న సముద్రంలోకి వరద నీరు విడిచి పెట్టడంతో కోనసీమలోని వశిష్ఠ వైనతేయ గౌతమి గోదావరి నది పాయలు వరద ప్రవాహం పెరిగింది. చాకలి పాలెం సమీపంలోని కనకాయలంక వద్ద కాజ్వే పైకి వరద నీరు చేరుతుంది. కోనసీమలోని వివిధ లంక గ్రామాల ప్రజలు రాకపోకలు సాగిస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లాలోని దేవీపట్నం, కోనసీమ లంకల్ని వరద చుట్టుముట్టింది.
ఇదీ చదవండి: Bhabanipur bypoll: భవానీపూర్‌లో పోలింగ్ ప్రారంభం