తూర్పుగోదావరి జిల్లా కోనసీమలో వరద తగ్గినట్లే తగ్గి మళ్లీ పెరుగుతోంది. కొన్ని లంక గ్రామాలు ఇప్పుడిప్పుడే వరద నుంచి తేరుకుంటున్నాయి. 64 గ్రామాలు వరద ప్రభావానికి గురయ్యాయి. పేదలకు చెందిన పూరిపాకలు కుప్పకూలాయి. పడిపోయిన పాకలను చూసి బాధితులు ఆవేదన చెందుతున్నారు. నిన్నటివరకూ సురక్షిత ప్రాంతాల్లో ఉన్నవారు ఇప్పుడు వారి ఇళ్లకు చేరుకుని బాగుచేసుకునే పనిలో పడ్డారు. తమను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.
రావులపాలెం మండలం గౌతమి, వశిష్ట వంతెన వద్ద గోదావరి ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. వరద తగ్గినట్లే తగ్గి మళ్లీ పెరిగింది. లంక ప్రాంతాల్లోని పంట పొలాలు నీటిలో తేలుతున్నాయి. కూరగాయల తోటలు పూర్తిగా నీటమునిగాయి. ధవళేశ్వరం బ్యారేజి దిగువన ఉన్న బొబ్బర్లంక, ఊబలంక, కొమర్రాజు లంక, గోపాలపురం, కేదర్లంక, నారాయణ లంక, అద్దంకివారి లంక, సత్తెమ్మ లంక వంటి ప్రాంతాల్లోని అరటి, మునగ, తమలపాకు, కంద, పూల తోటలు నీటిలోనే ఉన్నాయి.
ఇవీ చదవండి...