ETV Bharat / state

వరదపోటుతో ప్రమాదకరంగా ర్యాలీ అంకంపాలెం లాకులు - తూర్పు గోాదావరి జిల్లా వార్తలు

తూర్పు గోదావరి జిల్లా ర్యాలీ అంకంపాలెం అవుట్ ఫాల్ స్లూయిజ్ లాకులు ప్రమాదకరంగా మారాయి. ఈ లాకుల్లో ఒకటి వంగిపోయింది. వరదనీరు బయటకు వచ్చి పొలాలను ముంచెత్తింది. గ్రామస్థులు ఇచ్చిన సమాచారంతో స్పందించిన అధికారులు.. లాకులకు అడ్డంగా ఇసుక బస్తాలు వేయించారు.

వరదపోటుతో ప్రమాదకరంగా ర్యాలీ అంకంపాలెం లాకులు

author img

By

Published : Aug 18, 2020, 4:16 PM IST

తూర్పు గోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం ర్యాలీ అంకంపాలెం యేటిగట్టు వద్ద ఉన్న అవుట్ ఫాల్ స్లూయిజ్ లాకులు ప్రమాదకరంగా మారాయి. పంట కాలువలో వరద నీరు అధికంగా చేరుతోంది. వరదల సమయంలో గ్రామాల్లోకి నీరు రాకుండా.. ఆ నీటిని గోదావరిలోకి వెళ్లే విధంగా బ్రిటిష్ కాలంలో యేటిగట్లపై అవుట్ ఫాల్ స్లూయిజ్ లు ఏర్పాటు చేశారు.

ఈ లాకులకు మూడు గేట్లు ఉండగా ఒకటి వంగిపోయింది. వరద నీరు బయటకు వచ్చి చుట్టు పక్కల పొలాలను ముంచెత్తింది. పరిస్థితిని గ్రామస్థులు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన అధికారులు వరదనీరు బయటకు రాకుండా ఇసుక మూటలు అడ్డుగావేశారు. గోదావరి వరద పోటుతో గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు.

ఇదీ చదవండి:

యానాంను ముంచెత్తిన వరద...ముంపు గ్రామాల్లో మంత్రి పర్యటన

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.