తూర్పు గోదావరి జిల్లా ధవళేశ్వరం ఆనకట్ట వద్ద గోదావరి ప్రవాహం శాంతిస్తోంది. నీటిమట్టం 13.7 అడుగులకు చేరింది. అధికారులు 2 వ ప్రమాద హెచ్చరికను ఉపసంహరించారు. 13 వేల 800 క్యూసెక్కుల నీటిని డెల్టా కాల్వలకు వదులుతూ.... మిగులు జలాలు 9 లక్షల 80వేల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. వరద తగ్గుముఖం పట్టినా.. పలు ప్రాంతాల్లో పంటలు రోజుల తరబడి నీటిలో నానటంపై రైతులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు.
ఇదీ చూడండి: