ETV Bharat / state

తూర్పున తగ్గిన వరద.. తేరుకునేందుకు సమయం - గోదావరి వరదలతో పంట నష్టం

తూర్పుగోదావరి జిల్లా లంకల్లో వరద వీడింది. బురద మిగిలింది. ఎగువ నుంచి గోదావరికి ప్రవాహం తగ్గడం, ఉప నదులు శాంతించడంతో లోతట్టు ప్రాంతాలు ఊపిరి పీల్చుకున్నాయి. ముంపు బాధితులు తేరుకునేందుకు కొంత సమయం పట్టనుంది. రైతులు భారీగానే నష్టపోయారు.

తూర్పున తగ్గిన వరద.. తేరుకునేందుకు సమయం
తూర్పున తగ్గిన వరద.. తేరుకునేందుకు సమయం
author img

By

Published : Aug 26, 2020, 6:00 AM IST

తూర‌్పుగోదావరి జిల్లాలోని గోదావరి పరివాహక ప్రాంతాన్ని బెంబేలెత్తించిన వరదలు ఎట్టకేలకు శాంతించాయి. వరద జోరు తగ్గినా అటు మన్యం, ఇటు మైదానంలోని లంక గ్రామాలను ముంపు కష్టాలు వీడలేదు. దేవీపట్నం మండలంలోని 36 గ్రామాల్లో పరిస్థితి కుదుట పడుతోంది. ఇళ్లలో చేరిన వరద నీరు తగ్గడంతో బురదను తొలగించే పనిలో స్థానికులు నిమగ్నమయ్యారు. కొన్ని పూరిళ్లు కొట్టుకుపోగా, అధిక సంఖ్యలో ఇళ్లు నేలకూలాయి. తాత్కాలిక ఉపశమనం కోసం టార్పాలిన్లు పంపిణీ చేయాలని బాధితులు కోరుతున్నారు.

తూర్పుగోదావరి జిల్లాలోని 26 మండలాల పరిధిలోని 181 గ్రామాల్ని వరదలు ముంచెత్తగా అందులో 144 గ్రామాలు ముంపు సమస్య ఎదుర్కొన్నాయి. లక్షా 27వేల 161 మంది వరదలకు ప్రభావితమైనట్లు అధికారులు గుర్తించారు. 122 గృహాలు దెబ్బతినగా 33 వేల 971 ఇళ్లు నీట మునిగినట్లు తేల్చారు. 67వేల10 మందిని సురక్షిత ప్రాంతాలకు చేర్చి భోజనాలు అందించామన్నారు. ఈ వారం రోజుల్లో 4 లక్షల ఆహార పొట్లాలు, 14 లక్షల 93 వేల మంచినీటి ప్యాకెట్లు పంపిణీచేసినట్లు అధికారులు చెబుతున్నారు.

జిల్లాలో వరదల కారణంగా 3వేల 863 హెక్టార్లలో వ్యవసాయ పంటలు, 10వేల 624 హెక్టార్లలో ఉద్యాన పంటలు నీట మునిగినట్లు అధికారులు గుర్తించారు. గోదావరి వరదలు కోనసీమ లంక గ్రామాల రైతుల్ని తీవ్రంగా నష్ట పరిచాయి. వరి, అరటి పంటలు కుళ్లిపోయాయి. ఆత్రేయపురం, ఆలమూరు, కొత్తపేట, రావులపాలెం, కేదర్లంక అయినవిల్లి తదితర మండలాల్లో అరటి ఎక్కువగా సాగు చేస్తుంటారు. కొన్ని అరటి చెట్లు దెబ్బతినగా పక్వానికి వచ్చిన గెలల్ని రైతులు ఒడ్డుకు చేర్చేందుకు ఇబ్బందిపడుతున్నారు. వరద నీటిలోనే నడుచుకుంటూ వాటిని ఏటిగట్టుకు చేర్చాల్సి వస్తోంది.

ఇదీ చదవండి : అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలో తప్పిన పెనుప్రమాదం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.