ETV Bharat / state

జలదిగ్బంధంలో దేవీపట్నం - rajamahendravaram

గోదారమ్మ వరద ప్రవాహం ఐదోరోజు కొనసాగుతోంది. వరద నీటితో దేవీపట్నం మండలం నీటమునిగింది.

గోదావరి
author img

By

Published : Aug 4, 2019, 10:13 AM IST

Updated : Aug 4, 2019, 11:35 AM IST

తూర్పుగోదావరి జిల్లాలో గోదావరి వరద ప్రవాహం ఉద్ధృతమవుతోంది. వరద నీటితో దేవీపట్నం మండలం నీటమునిగింది. మండలం పరిధిలోని సుమారు 32 గ్రామాలు వరదలో చిక్కుకున్నాయి. ఈ గ్రామాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. ఐదురోజులుగా మండలంలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. తాగునీటికోసం స్థానికులు వరద బాధితులు ఇబ్బందులు పడుతున్నారు. సహాయక చర్యలు అంతంతమాత్రంగానే కొనసాగుతున్నాయి. వరదలతో విషసర్పాలు ఇళ్లలోకి వస్తుండటంతో మన్యం వాసులు భయాందోళలనలకు గురవుతున్నారు. వరద నీటి ప్రవాహంతో గండి పోచమ్మ ఆలయం మునిపోయింది. సుమారు 600 ఇళ్లలోకి వరద నీరు చేరింది. వరదలో నాటుపడవలపైనే అధికారులు ప్రయాణం సాగిస్తున్నారు. హెలికాప్టర్ల ద్వారా సహాయక చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుకుంటున్నారు. తమను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని కోరుతున్నారు.

జలదిగ్బంధంలో దేవిపట్నం మండలం

ఇదీ చదవండి.

ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ

Intro:ap_knl_111_18_sarvasabhya_samavesam_vaaeda_av_c11 రిపోర్టర్: రమేష్ బాబు, వాట్సాప్ నెంబర్:9491852499, కోడుమూరు నియోజకవర్గం, కర్నూలు జిల్లా. శీర్షిక: కోరం లేక వాయిదా పడ్డ సర్వసభ్య సమావేశం

Body:కర్నూలు జిల్లా కోడుమూరు ఎంపీడీవో కార్యాలయంలో ఏర్పాటుచేసిన మండల సాధారణ సర్వసభ్య సమావేశం కోరం లేక వాయిదా పడింది. 19 మంది ఎంపిటిసిల గాను కనీసం ఏడు మంది ఎంపీటీసీలు హాజరు కావాల్సి ఉండగా ఎంపీపీ తో కలుపుకొని కేవలం ఐదు మంది మాత్రమే హాజరయ్యారు.

Conclusion:ఉదయం పదిన్నర నుంచి పదకొండున్నరకు ఒకసారి, పన్నెండున్నరకు కు మరోసారి మొత్తం రెండు సార్లు ఎంపీడీవో సుధామణి సర్వసభ్య సమావేశాన్ని వాయిదా వేశారు. అయినప్పటికీ కోరం కు అవసరమైన ఎంపీటీసీలు రాకపోవడంతో ఎంపీపీ అనుమతితో కార్యక్రమాన్ని వాయిదా వేశారు. తిరిగి ఎప్పుడు నిర్వహించేది త్వరలో చెబుతామని వివరించారు. దాంతో మండల ప్రత్యేక అధికారులు ఇతర శాఖల అధికారులు వెనుతిరిగారు
Last Updated : Aug 4, 2019, 11:35 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.