తూర్పుగోదావరి జిల్లా మారేడుమిల్లి మండలం జి.ఏం.వలస కూడలి వద్ద శుక్రవారం సాయంత్రం రూ.20 లక్షల విలువైన 1000 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు నిందితులను అరెస్ట్ చేయడంతో పాటు బొలెరో వాహనం, గంజాయి బస్తాలను సీజ్ చేశారు. తమకు సమాచారం రావడంతో జి.ఏం.వలస కూడలి వద్ద వాహన తనిఖీలు నిర్వహించామని ఏఎస్పీ బిందుమాధవ్ చెప్పారు. గంజాయి రవాణా చేస్తున్న ఒడిశాకు చెందిన వ్యక్తులను రిమాండ్కు తరలించామన్నారు.
ఇదీ చదవండి: కారు టైరు పేలి... పింగాణీ వ్యాపారి మృతి