విశాఖ ఏజెన్సీ నుంచి హైదరాబాద్కు తరలిస్తోన్న గంజాయిని తూర్పుగోదావరి జిల్లా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కోటనందూరు మండలం తాటిపాక వద్ద వాహన తనిఖీలు చేస్తున్న సమయంలో ఓ ఇన్నోవా వాహనం వెనక్కి తిప్పి పారిపోతుండగా పోలీసులు వెంబడించి పట్టుకున్నారు. అందులో 180 కిలోల గంజాయిని గుర్తించారు. ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసి కారును స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి: