దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ ఘటన మరవకముందే అలాంటి దారుణమే ఏపీలో జరిగింది. తూర్పుగోదావరి జిల్లా ఐ.పోలవరం మండలం జి.వేమవరంలో 50 ఏళ్ల మహిళపై దుండగులు సామూహిక అత్యాచారం చేసి హతమార్చారు. ముగ్గురు వ్యక్తులు ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. నిందితుల్లో ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. మిగతా ఇద్దరి కోసం గాలింపు చేపట్టినట్లు జిల్లా ఎస్పీ తెలిపారు. మృతురాలి భర్త, కుమారుడు గతంలో మృతి చెందగా, కుమార్తె హైదరాబాద్‌లో నివాసం ఉంటోంది. ఘటన జరిగిన సమయంలో ఇంట్లో ఆమె ఒక్కరే ఉన్నారు.
ఘటనా స్థలాన్ని ఎస్పీ నయీం అస్మి పరిశీలించారు. మృతురాలి ఇంటి ఆవరణలో కారం జల్లి ఉండటాన్ని పోలీసులు గుర్తించారు. డాగ్ స్క్వాడ్‌ను రంగంలోకి దింపారు. పొరుగునే ఉన్న రెండు ఇళ్ల వద్దకు వెళ్లి తిరిగి మృతురాలి ఇంటికి చేరింది. కేసును త్వరగా ఛేదిస్తామని ఎస్పీ తెలిపారు. నిందితుడు కేశనకుర్తి నాగబాబును పోలీసులు ఘటనా స్థలికి తీసుకురాగా స్ధానికులు అతనిపై దాడిచేయటంతో తిరిగి స్ఠేషన్ కు తరలించారు. మృతదేహాన్ని శవపంచనామా అనంతరం..శవపరీక్షల కొరకు ఆసుపత్రికి తరలించారు..
ఇవి కూడా చదవండి: