తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరం నియోజవర్గంలో గణేష్ నిమజ్జనాలు కోలాహలంగా ప్రారంభమయ్యాయి. శనివారం లంకల గన్నవరం, పి.గన్నవరం, తాటికాయలవారిపాలెంలో ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో లో వినాయక విగ్రహాలను ఊరేగింపు చేశారు. అందంగా అలంకరించిన వాహనాల్లో గణనాథున్ని తీసుకెళ్లారు. యువత కేరింతలు చేస్తూ, 'గణపతి బప్పా మోరియా' అంటూ నిమజ్జనానికి తరలివెళ్తన్నారు.
ఇది కూడా చదవండి.