తూర్పుగోదావరి జిల్లా పి. గన్నవరంలోని వైనతేయ గోదావరి నదిపై గల డొక్కా సీతమ్మ అక్విడెక్ట్ నిర్వహణ పనులు చేయక అధ్వాన్నంగా తయారైంది. ఈ కట్టడం ద్వారా రాజోలు దీవిలోని సఖినేటిపల్లి, మలికిపురం, రాజోలు, మామిడికుదురు, పి. గన్నవరం, లంకలగన్నవరం, నాగుల్లంక, వాడ్రేవుపల్లి, మానేపల్లి, మొండెపులంక గ్రామాలకు చెందిన 3లక్షల 50 వేల మందికి తాగునీరు...50 వేల ఎకరాలకు సాగునీరు రవాణా మార్గంగా ఈ అక్విడెక్ట్ ఉపయోగపడుతుంది. ఇంతటి ప్రాధాన్యత గల ఈ కట్టడం నిర్వహణకు నిధులు మంజూరు చేయకుండా నిర్లక్ష్యం చేస్తున్నారు. రోడ్డు దెబ్బతిని పాడైపోయింది. విద్యుత్ దీపాలు వెలగడం లేదు, హ్యాండ్ రెయిలింగ్ ఊడిపోయింది. రక్షణ గోడలమీద చెట్లు పెరిగిపోతున్నాయి. ఈ కట్టడం నిర్వహణకు నిధులు మంజూరు చేయాలని ప్రజలు కోరుతున్నారు. తక్షణమే రహదారికి మరమ్మతులు చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
ఇదీ చూడండి.
రాష్ట్రంలో కొత్తగా 7,228 కరోనా కేసులు, 45 మరణాలు