ప్రముఖ చమురు సంస్థ ఓఎన్జీసీ సామాజిక భద్రత, సహకారం కార్యక్రమంలో భాగంగా... కేంద్రపాలిత యానాంలో ఉచిత కంటివైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. రాజమహేంద్రవరం నగరానికి చెందిన ప్రముఖ కంటి ఆసుపత్రి సిబ్బంది పర్యవేక్షణలో కార్యక్రమం నిర్వహించారు. ఈ ఉచిత శిబిరానికి కంటి సమస్యలతో బాధపడుతున్న వారు అధిక సంఖ్యలో వచ్చారు. ఉచిత వైద్య శిబిరానికి వచ్చిన వారందరికీ స్థానిక లయన్స్ క్లబ్ సభ్యులు సహకారం అందించారు.
ఇదీ చదవండి: కేదార్లంకలో ఇరువర్గాల ఘర్షణ.. పలువురికి పరిస్థితి విషమం