అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆదివారం రాజమహేంద్రవరంలోని అర్బన్ పోలీస్స్టేషన్ ఆవరణలో మహిళలకు ఉచితంగా క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించారు. అర్బన్ పరిధిలోని విధుల్లో ఉన్న పోలీస్ కుటుంబాల్లోని 30 సంవత్సరాల పైబడి మహిళలకు పరీక్షలు చేశారు. అర్బన్ పోలీస్ శాఖ, రోటరీ క్లబ్ రాజమహేంద్రవరం, గైనకాలజీ వైద్యుల అసోసియేషన్, జీఎస్ఎల్ వైద్యకళాశాల సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. మహిళలు ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో గైనకాలజిస్ట్, రాష్ట్ర కోఆర్డినేటర్ డాక్టర్ కె. అరుణ కుమారి తదితరులు ఆరోగ్యం పట్ల మహిళలు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. మహిళల సంరక్షణకు నూతన చట్టాలతోపాటు అన్నీ సంరక్షణ చర్యలు తీసుకుంటామని రాజమహేంద్రవరం అర్బన్ ఏఎస్పీ(అడ్మిన్) డాక్టర్ జి. మురళీకృష్ణ అన్నారు.
ఇదీ చదవండి: బంగాల్లో వ్యక్తి మృతి.. కరోనా పరీక్షకు రక్త నమూనా