తూర్పు గోదావరి జిల్లా కడియం.. ఈ పేరు వింటే చాలు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన నర్సరీలు గుర్తుకు వస్తాయి. 11 వేలకుపైగా జనాభా ఉన్న ఈ మేజర్ పంచాయతీ వార్షిక ఆదాయం 50 లక్షల రూపాయల పైమాటే. ప్రసిద్ధి గాంచిన కడియం గ్రామ సర్పంచ్‌గా.. బొచ్చా నర్సమ్మ 2001లో గెలిచారు. ప్రస్తుతం అదే గ్రామంలో పారిశుద్ధ్య కార్మికురాలిగా జీవనం సాగిస్తున్నారు. సర్పంచ్‌గా నిస్వార్థంగా సేవలందించారు నర్సమ్మ. భర్త రాజారావు కూడా అదే పంచాయతీలో పారిశుద్ధ్య కార్మికుడిగా పని చేసేవారు. ఆరేళ్ల క్రితం ఆయన అనారోగ్యంతో చనిపోయారు. తండ్రి ఉద్యోగాన్ని కుమారుడు సుశీలరావుకు ఇచ్చారు. ఆ కుమారుడు సైతం.. కరోనాతో ఇటీవల మృతి చెందాడు.
సర్పంచ్ గా చేసినా ప్రస్తుతం పూట గడవక మళ్లీ పారిశుధ్య కార్మికురాలిగా చేస్తున్నాని ఆవేదన చెందుతున్నారు. సర్పంచ్ నర్సమ్మ ఎంతో నిజాయితీగా సేవలు అందించారు. ప్రస్తుతం ఆమె కుటుంబానికి రావాల్సిన బకాయిలు కూడా అందించలేదని బంధువులు చెబుతున్నారు. మేజర్ పంచాయతీకి సర్పంచ్‌గా పని చేసినా....కుటుంబ పోషణకు పారిశుద్ధ్య కార్మికురాలిగా తిరిగి సేవలు అందించడంపై ఆదర్శంగా నిలుస్తున్నారు. తమ కుటుంబానికి రావాల్సిన బకాయిలు చెల్లించి ఆదుకోవాలని నర్సమ్మ కుటుంబీకులు వేడుకుంటున్నారు.
ఇదీ చదవండి: