FOG IN KONASEEMA: తూర్పుగోదావరి జిల్లా కోనసీమలో పొగమంచు అందాలు కనువిందు చేస్తున్నాయి. ఉదయం ఎనిమిది గంటలు దాటినా వీడని పొగమంచు.. ప్రకృతిని ఆహ్లాదకరంగా మార్చింది. రహదారులను మంచుతెరలు కమ్మేశాయి. పొద్దుపొద్దున్నే కిలకిలమంటూ పక్షుల రావాలకు తోడు వికసించే పువ్వులపై కురుస్తున్న మంచు అందాలు అబ్బురపరుస్తున్నాయి. కొబ్బరి చెట్ల మధ్య నుంచి పొగమంచును విప్పుకొంటూ బయటకు వచ్చిన సూర్యభగవానుణ్ని చూసేందుకు కోనసీమ వాసులు పోటీపడ్డారు.
జగ్గయ్యపేట నియోజకవర్గవ్యాప్తంగా పొగమంచు అలముకుంది. తెల్లవారుజామున నాలుగు గంటల నుంచి విపరీతంగా మంచు పడుతుండటంతో వాహనదారులు ఇబ్బందులకు గురయ్యారు. పల్లెల్లో చిరు వ్యాపారులు సైకిల్, ద్విచక్ర వాహనాలు, ఆటోలో వెళ్లేందుకు ఇబ్బందులు పడుతున్నారు.