ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం వద్ద గోదావరి ప్రవాహం పెరుగుతోంది. గురువారం ఉదయానికి భారీగా వరద పెరగడంతో పోశమ్మగండి వద్ద ఇళ్లన్నీ మునిగాయి. పోశమ్మగండి-పి.గొందూరు మధ్య రహదారి పైకి నీరు చేరడంతో బయట ప్రాంతాలకు రాకపోకలు నిలిచాయి. గండిపోశమ్మ అమ్మవారి దర్శనాలను తాత్కాలికంగా నిలిపివేశారు. పాపికొండలు విహారయాత్రకు వెళ్లే పర్యాటక బోట్లు ఒడ్డుకు చేరాయి. పూడిపల్లి, దేవీపట్నం, తొయ్యేరు గ్రామాలను వరద నీరు వీడలేదు. దండంగి-చినరమణయ్యపేట మధ్య సీతపల్లి మధ్య రాకపోకలు స్తంభించాయి. ముంపు గ్రామాల్లో సుమారు రెండు నెలలుగా నీళ్లలో నానుతూ ఉండటంతో పలు ఇళ్లు కూలిపోతున్నాయని నిర్వాసితులు ఆవేదన చెందుతున్నారు.
ఇదీ చదవండి: Bribe: లంచం తీసుకుంటూ అనిశా వలకు చిక్కిన ఏడీఏ