తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం నుంచి వరదనీటిని దిగువకు వదలడంతో యానాం వద్ద గౌతమి గోదావరి పరవళ్లు తొక్కుతోంది. రెండు రోజుల నుండి కురుస్తున్నవర్షాలకు తాళ్ళరేవు మండలం పరిధిలోని వేల ఎకరాలు నీట మునిగాయి. కాలువలు పూడిపోవడంతో మురుగునీరు వెళ్లేందుకు దారిలేక ఊడ్చిన చేలు కుళ్లిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇదిలావుంటే.. వర్షాలతో మెట్ట భూములకు ప్రయోజనం కలుగుతుందని రైతులంటున్నారు. చేలు పచ్చగా కళకళలాడుతున్నాయని రైతులు సంతోషపడుతున్నారు. సముద్రంలో అలలు ఎక్కువగా ఉన్నందున మత్స్యకారులు వేటకు వెళ్ళవద్దని అధికారులు హెచ్చరించటంతో నావలన్నీ ఒడ్డుకే పరిమితమయ్యాయి.
ఇదీ చదవండి