గోదావరి నదికి వరదనీరు పొటెత్తడంతో తూర్పుగోదావరి జిల్లా పి. గన్నవరం అక్విడెక్ట్ల వద్ద వరద నీరు భారీగా చేరడంతో గోదావరి నదీ పాయ అయిన వైనతేయ వరద నీటితో ఉద్ధృతంగా పరుగులు తీస్తుంది. 1852లో కాటన్ నిర్మించిన పాత అక్విడెక్టు, 2000 లో కొత్తగా కట్టిన అక్విడెక్ట్ల వద్ద వైనతేయ నది వరదనీటితో చూపరలను ఆకట్టుకుంటుంది. వేసవిలో అడుగంటే ఈ నది వరద నీటితో ఇప్పుడు కళకళలాడుతుంది.
ఇదీ చదవండి: గోదావరిలో మరింత పెరిగిన వరద