గోదావరి ఉద్ధృతి వరదలకు ఇల్లు వదిలి సురక్షిత ప్రాంతాలకు వెళ్తున్న ప్రజల పరిస్థితి దయనీయంగా మారింది. మహోగ్ర రూపం దాల్చి లంక గ్రామాలను ముంచెత్తింది. లంక గ్రామాల ప్రజలు ఇల్లు వదిలి సురక్షిత ప్రాంతాలకు తరలిపోతున్నారు. ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద మూడో ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంది. ఈరోజు ఉదయం ఐదు గంటలకు ధవళేశ్వరం బ్యారేజీ నుంచి 21 లక్ష 89 వేల 293 క్యూసెక్కుల వరద నీటిని సముద్రంలోకి విడిచిపెట్టారు. గౌతమి వశిష్ఠ వైనతేయ గోదావరి నది పాయలు పొంగి ప్రవహిస్తున్నాయి. లోతట్టు గ్రామాలకు చెందిన నివాసాల్లో వరద నీరు చేరింది. ఫలితంగా వరద బాధితులు సామాన్లు సర్దుకుని సురక్షిత ప్రాంతాలకు తరలిపోతున్నారు. కోనసీమలో పి గన్నవరం, అయినవిల్లి, మామిడికుదురు, ముమ్మిడివరం, కొత్తపేట, మలికిపురం, రాజోలు, రావులపాలెం ఆత్రేయపురం, సఖినేటిపల్లి, ఐ పోలవరం తదితర మండలాల్లో వరద ఉద్ధృతి కారణంగా లోతట్టు లంక గ్రామాల ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు.
ఇదీ చూడండి