ETV Bharat / state

కోలుకుంటున్న ముంపు ప్రాంతాలు... - manyam

గోదావరి వరద ముంపు బారి నుండి తూర్పుగోదావరి జిల్లాలోని కొన్ని ప్రాంతాలు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాయి. వరద ఉద్ధృతి తగ్గడంతో...పునరుద్ధరణ పనులు వేగవంతం చేసామని జిల్లా కలెక్టర్ తెలిపారు.

విద్యుత్, రహదారులు, తాగునీటి సరఫరాపై ప్రత్యేక దృష్టి
author img

By

Published : Aug 15, 2019, 6:52 AM IST

విద్యుత్, రహదారులు, తాగునీటి సరఫరాపై ప్రత్యేక దృష్టి

తూర్పుగోదావరి జిల్లాలోని మన్యం, కోనసీమ ప్రాంతాలు గోదావరి ముంపు బారి నుండి కోలుకుంటున్నాయి. వరద ప్రవాహం తగ్గడంతో...పారిశుద్ధ్య నిర్వహణతో పాటు విద్యుత్, రహదారులు, తాగునీటి సరఫరాపై ప్రత్యేక దృష్టి సారించినట్లు జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డి తెలిపారు. పాఠశాలలు, అంగన్​వాడీ వంటి ప్రభుత్వ భవనాల పునరుద్ధరణ పనులు 80శాతం పూర్తయినట్లు చెప్పారు. కోనసీమలోని 8మండలాలతో పాటు జిల్లాలో మొత్తం 11మండలాల్లో 2వేల 593హెక్టార్లలో ఉద్యాన పంటలు నష్టపోయినట్లు...దీంతో సుమారు 6వేల మంది రైతులకు 5కోట్ల నష్టం వాటిల్లిందని ఆయన తెలిపారు.

ఇదీ చూడండి: రామోజీ ఫిల్మ్​సిటీలో సాహో ప్రీ రిలీజ్ ఈవెంట్​

Intro:AP_TPG_06_14_DONDA_RYTHULA_DHARNA_AVB_AP10089
నోట్: ఈటీవీ ఆంధ్రప్రదేశ్ కు కూడ వాడుకోగలరు
రిపోర్టర్ : పి. చింతయ్య
సెంటర్  : ఏలూరు, ప.గో.జిల్లా
ఫోన్ నంబర్: 8008574484
(  ) దొండపాదుల రైతుల సమస్యలు పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో పశ్చిమ జిల్లా ఏలూరులోని కలెక్టరేట్ వద్ద రైతులు చలో కలెక్టరేట్ కార్యక్రమం నిర్వహించి అనంతరం పెద్ద ఎత్తున ధర్నా చేశారు.

Body:ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి కే శ్రీనివాస్ మాట్లాడుతూ జిల్లాలో వందలాది మంది రైతులు దొండపాదులు వేశారని తెలిపారు. ప్రస్తుత తరుణంలో మార్కెట్లో ధర లేక కొన్ని సందర్భాల్లో ఒడిదుడుకులు ఎదుర్కొన్న కొంత ఆశాజనకంగా ఉండేదన్నారు. అయితే ఇటీవల తెగులు వ్యాపించడంతో దండ పాదులు దెబ్బతిన్నాయన్నారు లక్షలాది రూపాయల పెట్టుబడి రైతులు నష్టపోయారు. ఇంకా చాలా మంది రైతులకు పొందిన సబ్సిడీ కూడా అందలేదన్నారు గిట్టుబాటు ధర లేదు రైతులు కష్టాల్లో ఉన్నారని అన్నారు. ఉద్యాన శాఖ అధికారులు తక్షణమే స్పందించి రైతులకు నష్టపరిహారం ఇవ్వాలని, ఉద్యాన పంటల తెగులు నివారణకు చర్యలు చేపట్టాలని దండ రైతులకు ఇవ్వాల్సిన బంతుల సంచిని అందించాలని ఉద్యాన పంటల రైతుల సమస్యలు పరిష్కరించే గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామన్నారు.

Conclusion:బైట్. కే శ్రీనివాస్, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.