గత పదిరోజులుగా తూర్పు గోదావరి జిల్లా లంకగ్రామాలను అతలాకుతలం చేసిన వరద తగ్గుముఖం పట్టింది. ముక్తేశ్వరం జీ పెదపూడి వద్ద కాజువేలు ముంపు నుంచి బయటపటంతో అప్పనపల్లి కాజ్వే ,కే ఏనుగుపల్లి రహదారుల పై వరద నీటి ప్రవాహం తగ్గింది. చాకలి పాలెం సమీపంలోని కాజ్వే,శివలంక లు ఇంకా వరదనీటిలోనే ఉన్నాయి. కనకాయలంక.బూరుగులంక,ఉడుముడి లంక,అరిగెలవారిపేట, జీ పెదపూడి లంక గ్రామాల ప్రజలు మర పడవలతో రాకపోకలు సాగిస్తున్నారు. అంతేగాక ఇక్కడి నది పాయల్లో అక్టోబర్ వరకు వరద నీరు ప్రవహిస్తుంది. అప్పటి వరకు ఇబ్బందులు తప్పవని ప్రజలు అంటున్నారు.
ఇదీచూడండి.వాగు ఉప్పొంగింది.. వారికి తాడే తోడైంది!