ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు ధవళేశ్వరం బ్యారేజ్‌కు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో అధికారులు దిగువనున్న సముద్రంలోకి నీటిని విడిచి పెడుతున్నారు. ఈ నెల 12న ఉదయం నీటిని దిగుకు వదిలిన అధికారులు తాజాగా గురువారం ఉదయం భారీగా వరద నీటిని దిగువకు విడుదల చేశారు. బుధవారంతో పోలిస్తే ఇది దాదాపుగా రెట్టింపయ్యింది. కోనసీమలోని గోదావరి నది పాయలైన గౌతమి, వశిష్టస వైనతేయలు నిండుగా ప్రవహిస్తున్నాయి. పి గన్నవరం పాత కొత్త అక్విడెక్ట్‌ల మధ్య వైనతేయ, గోదావరిలో ప్రవాహం జలకళను సంతరించుకుని కనువిందు చేస్తోంది.
ఇదీ చదవండి :