తూర్పు గోదావరి జిల్లా కోనసీమ ప్రాంతంలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. వరి చేలు ముంపు నీటిలోనే ఉన్నాయి. మురుగు కాలువలు మూసుకుపోయి ముంపు నీరు వేగంగా వరిచేలోకి చేరుతోంది. కోనసీమలో పి.గన్నవరం, మామిడికుదురు, అంబాజీపేట, ఉప్పలగుప్తం, కాట్రేనికోన, సఖినేటిపల్లి, మలికిపురం, అల్లవరం తదితర మండలాల్లో సుమారు ఎనిమిది వందల హెక్టార్ల విస్తీర్ణంలో ఖరీఫ్ వరి పంట ముంపు నీటిలో ఉంది. రోజుల తరబడి ముంపు నీటిలో ఉండటం కారణంగా వరి చేలు కుళ్లి పోతాయని రైతులు ఆందోళన పడుతున్నారు. మురుగు కాలువలను బాగు చేయాలని వారు అధికారులకు మొరపెట్టుకున్నారు.
ఇదీ చదవండి: