యానాంకు నలుమూలల నుండి వచ్చే ప్రయాణికులు, వివిధ పనుల నిమిత్తం వచ్చే రోజువారి కూలీల ఆకలి బాధలు తీర్చేందుకు యానాం ప్రజా స్వచ్ఛంద సేవా సంస్థ వినూత్న కార్యక్రమాన్ని చేపట్టింది. ఢిల్లీకి చెందిన ఐఎఫ్సీఐ సహకారంతో ఒక వాహనంలో తయారు చేసిన ఆహార పదార్థాలను తీసుకువచ్చి ప్రధాన కూడళ్లలో భోజనం అందిస్తోంది. అన్నం, రెండు రకాల కూరలు, సాంబారు, పెరుగుతో కలిపి రూ.5కే అందజేస్తోంది. ప్రతిరోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి ఒంటి గంట వరకు నిర్దేశించిన ప్రాంతాలలో సుమారు 1000మందికి కడుపు నిండా భోజనాన్ని వడ్డిస్తున్నారు. ఈ ఆహారం ఇంటి భోజనాన్ని తలపించేలా ఉంటుందని స్థానికులు తెలిపారు. ఇదే భోజనం బయట హోటల్లో తినాలంటే రూ.100 అవుతుందని.. కూలీ డబ్బు కూడా ఆదా అవుతుందని కూలీలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఇదీచూడండి.కడియంలో క్రిస్మస్.. కొత్త సంవత్సర సందడి