చేపల వేట ముగిసిన జూలై, ఆగస్టు నెలలో జీవనోపాధి కల్పించాలని కోరుతూ ఏడీ శ్రీనివాసరావుకు జాలర్లు వినతిపత్రం అందజేసారు. తూర్పుగోదావరి జిల్లా ఏలేశ్వరం జలాశయానికి చెందిన సుమారు ఐదు వందల మంది జాలర్లు.. ఈ మేరకు తమ సమస్యలను వినతిపత్రంలో వివరించారు. ఉపాధి లేని సమయంలో.. కుటుంబం గడవడం కష్టంగా ఉందంటూ.. స్థానిక ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్రప్రసాద్ వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం నుంచి వచ్చే సహాయాన్ని తప్పకుండా అందేలా చేస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. వేట విరామ సమయాన్ని ఖచ్చితంగా పాటించాలని జాలర్లకు సూచించారు.
జీవనోపాధి కల్పించాలని జాలర్ల వినతి పత్రం
చేపల వేట విరామ సమయంలో జీవనోపాధి కల్పించాలని కోరుతూ ఏలేశ్వరం జలాశయానికి చెందిన జాలర్లు... మత్స్యశాఖ అధికారులకు వినతిపత్రం అందజేశారు.
చేపల వేట ముగిసిన జూలై, ఆగస్టు నెలలో జీవనోపాధి కల్పించాలని కోరుతూ ఏడీ శ్రీనివాసరావుకు జాలర్లు వినతిపత్రం అందజేసారు. తూర్పుగోదావరి జిల్లా ఏలేశ్వరం జలాశయానికి చెందిన సుమారు ఐదు వందల మంది జాలర్లు.. ఈ మేరకు తమ సమస్యలను వినతిపత్రంలో వివరించారు. ఉపాధి లేని సమయంలో.. కుటుంబం గడవడం కష్టంగా ఉందంటూ.. స్థానిక ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్రప్రసాద్ వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం నుంచి వచ్చే సహాయాన్ని తప్పకుండా అందేలా చేస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. వేట విరామ సమయాన్ని ఖచ్చితంగా పాటించాలని జాలర్లకు సూచించారు.
ఉపాధిహామీ గుంతలు ఓ నిండు ప్రాణాన్ని బలిగొంది. దారిలేకుండా తవ్వడం వల్లే విద్యార్థి మృతి చెందాడని తల్లితండ్రులు ఆరోపిస్తున్నారు.
చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం చెన్నుగారిపల్లికి పంచాయతీ చెందిన ఈశ్వర్ యాదవ్ కుమారుడు వరుణ్ యాదవ్(10) స్థానిక స్కూల్లో ఐదవ తరగతి చదువుతున్నాడు.గత రెండురోజులుగా కురుస్తున్న వర్షాలతో ఉపాధి హామీ పనులలో నీటి నిల్వలు చేరడంతో ఆ నీటి గుంటలో పడిన బాలుడు మృతి చెందిన సంఘటన ఆదివారం చోటు చేసుకుంది.
ఉపాధి హామీ కుంటలోని గుంతలు నీటితో నిండి ఉండటంతో దారి కనబడక కాలుజారి వరుణ్ యాదవ్ నీటి గుంటలో పడ్డాడు.
స్థానికులు వచ్చి పిల్లవాడిని బయటకు తీసి, స్థానిక పి. కొత్తకోట ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు, అక్కడ డాక్టర్లు పరిశీలించి చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకు వెళ్లామన్నారు,అక్కడికి వెళ్లే లోపలే మార్గమధ్యంలో మృతి చెందాడని చిత్తూరు ప్రభుత్వ డాక్టర్లు డాక్టర్లు చెప్పారు.
ఈ విషయం తెలిసి గ్రామంలో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు శోకసముద్రంలో మునిగారు. కుమారుడి మృతి తో తల్లితండ్రులు ఈశ్వర్,భారతి తీవ్ర దుఖంతో విలపించారు.Conclusion:పి.రవికిషోర్,చంద్రగిరి.9985555813.